నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ని ఖరారు చేయకపోవడంతో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 107 వ మూవీ గా రూపొందుతూ ఉండడంతో , ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది.
ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తూ ఉండగా , దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ షూటింగ్ ని త్వరగా పూర్తి చేసి , ఆ త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగ వంతంగా ఫినిష్ చేసి ఈ మూవీ ని సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్ బి కె 107 మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడం , క్రాక్ మూవీ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.