ప్రభాస్... మారుతి మూవీలో సంజయ్ దత్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పరస మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ , నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ లలో పాల్గొంటూ వస్తున్నాడు . ఇలా ఒక మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకుని , మరో రెండు మూవీ ల షూటింగ్ లలో పాల్గొంటున్న ప్రభాస్ మరిvకొద్ది రోజుల్లో మారుతి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో కూడా నటించబోతున్నాడు.


ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మారుతి , ప్రభాస్ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ సరసన హీరోయిన్ లుగా నిధి అగర్వాల్ మరియు మాళవిక మోహన్ లను మూవీ యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.


అలాగే ఈ మూవీ లో మరో ముఖ్యమైన పాత్ర కోసం చిత్ర బృందం సంజయ్ దత్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మరి కొన్ని రోజుల్లో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తేరకేక్కపోయే మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు , ఈ మూవీ హర్రర్ కామెడీ జోనర్ లో తేరకేక్కనున్నట్లు కొన్ని రోజుల క్రితం కొన్ని వార్తలు బయటికి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: