చిరంజీవికి కొరటాల పై ఎందుకు అంత కోపం...?
అయితే తాజాగా చిరంజీవి కొరటాల శివను మరోసారి టార్గెట్ చేశారని తెలుస్తుంది.. కొరటాల శివ పేరు డైరెక్ట్ గా చెప్పకపోయినా పరోక్షంగా చిరంజీవి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
గాడ్ ఫాదర్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ ఈ సినిమా మెరుగవడంలో నా పాత్ర ఉందని అన్నారు. క్లైమాక్స్ సీన్ లో విలన్ పాత్రపై సానుభూతి వస్తుందని నేను చెప్పడంతో డైరెక్టర్ మోహన్ రాజా క్లైమాక్స్ ను మార్చడం జరిగిందని ఆయన కామెంట్లు కూడా చేశారు. సినిమా రిలీజ్ కు పదిరోజుల ముందు క్లైమాక్స్ సన్నివేశాలను రీషూట్ చేయడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. నాకుండే అపార అనుభవంతో సినిమాకు ఇన్ పుట్స్ ఇస్తానని చిరంజీవి కూడా అన్నారు.
ఆ ఇన్ పుట్స్ ను స్వీకరిస్తే సినిమాకు మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. రాఘవేంద్రరావు లాంటి స్టార్ డైరెక్టర్లకు సైతం నేను ఇన్ పుట్స్ ఇచ్చానని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం. ఆచార్య సినిమాకు సంబంధించి చిరంజీవి ఇన్ పుట్స్ ఇచ్చినా కొరటాల శివ తీసుకోలేదని ఆ కారణం వల్లే చిరంజీవి ఇలా చెబుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివను చిరంజీవి మళ్లీ పరోక్షంగా టార్గెట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట.. ఆచార్య సినిమా ఫలితం చిరంజీవిని చాలా బాధపెట్టిందని ఆ కారణం వల్లే ఆయన ఈ విధంగా చెబుతున్నారని కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, కొరటాల శివ ప్రస్తుతం వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు అయితే ఏర్పడ్డాయి.