జాతిరత్నాలు ను మించిన కామెడీ... హిట్ కొట్టేలా ఉన్నాడే.....
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రిన్స్. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సరసన బ్రిటిష్ భామ మరియా రబోష్యాపక నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాట్రైలెర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను చూస్తుంటే జాతిరత్నాలు కామెడీ గుర్తుకు రాక మానదు. ” కులం మతం గురించి ఇంకా కొట్టుకొనేవాళ్ళు ఉన్నారా” అంటూ సత్యరాజ్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. దేవరకోట అనే గ్రామంలో కులమతాల పట్టింపుతో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆ ఊరుకు సత్యరాజ్ కొడుకుతో కలిసి వస్తాడు.. సత్యరాజ్ కొడుకు స్కూల్ లో ఓ టీజర్ గా పనిచేస్తుంటాడు. అదే స్కూల్ కు టీచర్ గా వచ్చిన ఒక బ్రిటిష్ అమ్మాయితో ప్రేమలో పడతాడు.
ఆమె కూడా హీరోను ప్రేమించడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే కులం ను పట్టించుకొనే గ్రామస్థులు ఏకంగా మన దేశం కానీ పిల్లను ప్రేమిస్తావా అంటూ హీరో, హీరో కుటుంబంపై దండెత్తి వస్తారు. మరి చివరికి ఈ ఖండాంతర ప్రేమ గెలిచిందా..? గ్రామస్థులు వీరి పెళ్ళికి ఒప్పుకున్నారా..? లేదా అనేది కథగా తెలుస్తోంది. ఇక అనుదీప్ తన పంచ్ లతో ట్రైలర్ ను నింపేశాడు. ఇండియాకు సంబంధించిన ఒక్క విషయమన్నా ఫాలో అయ్యావా నువ్వు అని హీరోను అడుగగా భారతదేశం నా మాతృ భూమి.. భారతీయులందరు నా సోదరసోదరీమణులు ఫాలో అయ్యా కాబట్టే బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించా అని చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ట్రైలర్ వినోదాత్మకంగా కనిపిస్తోంది. శివ కార్తికేయన్ కామెడీ అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. థమన్ నేపధ్య సంగీతం చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే అనుదీప్ మరో జాతిరత్నాలు ను అందించేలా కనిపిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ జాతిరత్నాల డైరెక్టర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.