అన్ స్టాపబుల్ 2 ట్రైలర్ తో అదిరిపోయే అప్డేట్లు ఇచ్చిన బాలయ్య...
అని ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే అన్‌స్టాపబుల్ సీజన్ 2 టీజర్ రాగా. చంద్రబాబు ఎపిసోడ్ షూట్ చేస్తోన్న స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్‌తోనే బాలయ్య గూస్‌బంప్స్ తెప్పించేశాడు.
మరోసారి నెవర్ బిఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా వచ్చిన సీజన్ 2 ట్రైలర్లో బాలయ్య మామూలు రచ్చ చేయలేదు. ఈ అవైటెడ్ సీజన్ క్రేజీ అప్‌డేట్ రివీల్ అయ్యింది. ఓ ఇంట్రస్టింగ్ ట్రైలర్ లాంటి వీడియోతో అదిరిపోయే అప్‌డేట్ కూడా మేకర్స్ ఇచ్చేశారు. ఈ ట్రైలర్లో దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలయ్యను సరికొత్త లుక్‌లో చూపించారు.
బాలయ్య లుక్ అయితే కొత్తగా, స్టైలీష్‌గా అదిరిపోయేలా ఉంది. ట్రైలర్లో బాలయ్య ఈ అడ్వెంచరస్ రైడ్‌లో ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్, మీకోసం మరింత రంజుగా అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ తో ఈ సారి కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు ప్రశ్నలు చాలా టఫ్‌గా ఉండబోతున్నాయని.. బాలయ్య కంటెస్టెంట్లను ఇరుకున పెట్టేందుకు కాచుకుని ఉన్నాడనే అర్థమవుతోంది.
ఇక అక్టోబర్ 14 నుంచి ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 14న చంద్రబాబు, లోకేష్‌ది స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. ఇక రెండో ఎపిసోడ్ ఎవరిదో కాదు ఇద్దరు కుర్ర హీరోలు అయిన జొన్నలగడ్డ సిద్ధు, విశ్వక్‌సేన్‌తో కలిసి చేస్తున్నారు. ఇది కూడా షూటింగ్ పూర్తయిపోయినట్టుగా తెలుస్తోంది.
అలాగే మెగా కాంపౌండ్ నుంచి చిరును తీసుకు రావాలని అనుకున్నా కుదర్లేదట. అందుకే సాయిధరమ్ తేజ్ వస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ కూడా వస్తున్నాడట. ఏదేమైనా ట్రైలర్‌తో బాలయ్య మరోసారి బుల్లితెరను షేక్ చేసేందుకు రెడీ అయినట్టు సిగ్నల్స్ ఇచ్చేశాడు.ఇక ఎంజాయ్ మామూలుగా ఉండదు.