అల్లుఅరవింద్ తెలివే తెలివి.. వావ్ అంటున్న నేటిజన్లు ...
దర్శకుడు రిషబ్ శెట్టి తనే ముఖ్య పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించాడు. కన్నడలో వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా దీన్ని అందరూ కొనియా డుతున్నారు. ఈ సినిమా కథాంశం, నటీ నటుల పెర్ఫామెన్స్, విజువల్స్, భారీతనం, అలాగే పతాక సన్నివేశాలకు సంబం ధించి ప్రశం సల జల్లు కురుస్తోంది.
కన్నడ నాట సంచలన వసూళ్లు రాబ డుతున్న ఈ సినిమా గురించి ఇతర భాషల వాళ్లకూ బాగానే ఆసక్తి కలిగింది. హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ముంబయి లాంటి ప్రధాన నగరాల్లో 'కాంతార'కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఆయా నగరాల్లో అందుబాటులో ఉన్న స్క్రీన్లలో సినిమాను ప్రదర్శిస్తుండగా.. హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.
'కాంతార' కన్నడ వెర్షన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎగబడు తున్న తీరు చూసిన అగ్ర నిర్మాత అల్లు అర వింద్ వెంటనే రంగం లోకి దిగిపో యారు. దసరాకు మూడు సినిమా లు రిలీజైన నేపథ్యంలో తర్వాతి వారాని కి తెలుగు
'కాంతార' తెలు గు వెర్షన్‌ను వచ్చే శుక్రవారమే గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నిర్ణయం గత రెండు మూ డు రోజుల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే హక్కులు తీసుకోవడం, డబ్బింగ్ పనులు మొదలుపెట్టేయడం జరిగిపోయింది. 'కాంతార' కన్నడ వెర్షన్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి, వచ్చే వారం థియేటర్లు ఖాళీగా దొరకడం గమనించి ఇంత వేగంగా స్పందించి తక్కువ వ్యవధిలో సినిమాను రెడీ చేస్తుండడం చూసి అల్లు అరవింద్ తెలివే తెలివి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టాలీవుడ్లో.