హీరోయిన్స్ కు రోల్ మోడల్ గా మారిన నయనతార !

Seetha Sailaja
క్రేజీ హీరోయిన్స్ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు పెళ్ళి చేసుకుని పిల్లలను కంటే అక్కడితో వారి కెరియర్ కు ఎండ్ కార్డు పడుతుంది. దీనితో చాలామంది హీరోయిన్స్ పెళ్ళి చేసుకున్నప్పటికీ ఎక్కడ తమ కెరియర్ కు బ్రేక్ పడుతుందో అన్న భయంతో పిల్లలనుకనే విషయంలో చాల ఆలస్యం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది.


హీరోయిన్స్ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు పెళ్ళి పీటలు ఎక్కడం ఒక మోడల్ గా మార్చుకున్నారు. లేటెస్ట్ గా నేహా దూపియా అదేవిధంగా అలియా భట్ తమకు గర్భం వచ్చింది అని తెలిసిన తరువాత ఆలస్యం చేయకుండా పెళ్ళి చేసుకుని ఒక ఇంటి వాళ్ళు అవుతున్నారు. అలియా భట్ అయితే తనకు గర్భం వచ్చినంత మాత్రాన షూటింగ్ లు ఆపెయాలా అంటూ తన సినిమాలను పూర్తి చేయడమే కాకుండా ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్ కోసం దేశం అంతా తిరుగుతూ పాటలు కూడ పాడింది.


అయితే టాప్ హీరోయిన్స్ లో చాల విభిన్నంగా ఉండే నయనతార ఒకవైపు షూటింగ్ లను వరసపెట్టి చేసుకుంటూ తనకు తన భర్త విఘ్నేష్ శివన్ కు కవల పిల్లలు పుట్టారు అంటూ ఆపిల్లల పాదాలను ముద్దు పెట్టుకుంటూ షేర్ చేసిన ఫోటో ట్రెండింగ్ గా మారడమే కాకుండా ఒక సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టింది. నయనతార పెళ్ళి అయిన దగ్గర నుండి వరసపెట్టి సినిమాలు చేస్తూ సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయింది.


ఆమె షూటింగ్ లకు ఏమాత్రం బ్రేక్ పడకుండా కోట్లాది రూపాయల సంపాదన కొనసాగిస్తూనే ఆమె ఇలా షార్ట్ కర్ట్ లో కవల పిల్లలకు తల్లి అవ్వడం ద్వారా కెరియర్ కొనసాగిస్తూనే తల్లి అయ్యే కోరిక ఎలా తీర్చుకోవచ్చో తోటి హీరోయిన్స్ కు మార్గదర్శి అయింది. పెళ్ళి తరువాత నయనతార మార్కెట్ పడిపోలేదు సరికదా తాను నటించే సినిమాలకు 4 కోట్ల పారితోషికం తీసుకనే స్థాయికి ఎదిగిపోయింది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: