రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తరికకుతున్న సలార్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరి కొంత కాలం లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ మూవీ లో ప్రభాస్ సరసన అందాల ముద్దు గుమ్మ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , మలయాళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయిన పృథ్విరాజ్ సుకుమరన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ కి రవి బస్ర్ ర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు , అలాగే అలాగే ఈ పాత్రలు కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలుగా కనిపించబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా దర్శకుడు ప్రశాంత్ నీల్ "సలార్" మూవీలో ప్రభాస్ని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో చూపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ మూవీ తో పాటు ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే అనే మూవీ లో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , అమితా బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతుంది.