ఇండియా లో సరోగసి నిషేధం చిక్కులో నయన తార...చిచ్చు పెట్టిన గృహలక్ష్మి..... తులసి....

murali krishna
గృహలక్ష్మీ సీరియల్‌తో కస్తూరీ శంకర్ అందరినీ మెప్పించేస్తోంది. తులసి పాత్రలో కస్తూరీ శంకర్ అదరగొట్టేస్తోంది.
అయితే ఆమె ప్రస్తుతం బుల్లితెర, వెండితెర, ఓటీటీ అంటూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఇలా తెరపై ఎంత బిజీ గా ఉన్నా కూడా సమాజంలోని వివా దాలు, సమస్యలు, విషయాల మీద స్పందిస్తుంటుంది. ఆమె సామాజికవేత్తగా, న్యాయవాదిగా, పొలిటికల్ అనలిస్ట్‌గా నెట్టింట్లో ఎంతో చురుగ్గా వ్యవహరిస్తుంటుంది.

తాజాగా నయన తార సరో గసి మీద కస్తూరీ శంకర్ పరోక్షం గా స్పం దించింది. నయనతార పేరు ఎక్కడా కూడా ప్రస్థావించలేదు. కానీ ప్రస్తుతం ఉన్న సమయంలో సరోగసి మీద స్పందించడం, అది మన దేశంలో నిశిద్దం అని చెప్పడం చూస్తుంటే.. అది కచ్చితంగా నయనతారను కార్నర్ చేసినట్టుగానే ఉందని కస్తూరీ మీద నయన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

ఇండియాలో సరోగ సిని బ్యా న్ చేశారు.. ఏదైనా వైద్య సంబంధ అడ్డంకులు ఉంటే తప్పా.. సరోగసిని ఆశ్రయించొద్దు. ఈ చట్ట 2022 జనవరి నుంచి అమల్లో ఉంది. ఇక ముందు ఇంకొన్ని రోజులు దీనిపై మనం మరింత వినబోతోన్నాం.. నీ పని నువ్ చూసు కో అని అంటోన్న ట్రోలర్ల కు ఇదే నా సమాధానం. నేను ఓ న్యాయ వాదిని. నేను దేని మీదైనా విశ్లేషణ చేయగలను. ఈ విషయం మీద చర్చలు జరిగినా, జరగక పోయినా నా అభిప్రాయాలు ఏ స్వార్థం లేకుండా ఏ ప్రయోజనం ఆశించకుండా వెల్ల డిస్తున్నాను అంటూ కస్తూరీ శంకర్ చెప్పుకొచ్చింది.

మొత్తానికి నయ న్ మాత్రం ఇప్పుడు ఇల్లీ గల్ పని చేసిం దంటూ కస్తూరీ శంకర్ చెప్పకనే చెప్పింది. మరి సరోగసి ద్వా రా బిడ్డను కనడం చట్టరిత్యా నేరమని కస్తూరీ శంకర్ అంటోంది. దీనిపై నయన్‌కు కొత్త చిక్కులు ఏమైనా వస్తాయా? అన్నది చూడాలి. ప్రస్తుతం నయన్ అయి తే తన కవల పిల్లలను చూస్తూ మురిసిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: