మెగాస్టార్
చిరంజీవి తాజాగా
గాడ్ ఫాదర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.
మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ
మూవీ లో , సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ , నయన
తార ఇతర కీలక పాత్రలో నటించారు.
తమన్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ
మూవీ మంచి అంచనాల నడుమ
అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు
హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ
మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకోవడంతో ఈ
మూవీ కి తెలుగు మరియు
హిందీ నుండి అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.
హిందీ నుండి ఈ
మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు వస్తూ ఉండడంతో కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించిన 600 స్క్రీన్ లను కూడా
మూవీ యూనిట్ పెంచింది. ఈ
మూవీ ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర సాధించింది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తున్న ఈ
మూవీ ని తాజాగా
సూపర్ స్టార్ రజినీ కాంత్ చూశారు. అది మాత్రమే కాకుండా
గాడ్ ఫాదర్ మూవీ పై
సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రశంసల వర్షం కూడా కురిపించాడు.