ఆ తేదీ నుండి "పుష్ప ది రూల్" మూవీ షూటింగ్ ప్రారంభం..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు తమిళ , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో రూపొంది అదే రేంజ్ లో విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందు కొని అదే రేంజ్ కలెక్షన్ లను కూడా సాధించింది.


ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించగా ,  సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా , ఫహద్ ఫజిల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఇతర ముఖ్య పాత్రల్లో సునీల్ ,  అనసూయ ,  రావు రమేష్ నటించారు. ఈ మూవీ ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ లో  సమంత స్పెషల్ సాంగ్ లో నటించింది. సమంత నటించిన ఈ మూవీ లోని స్పెషల్ సాంగ్ కి అద్భుతమైన క్రేజ్ లభించింది. పుష్ప ది రైస్ మూవీ లో అల్లు అర్జున్ తన నటన తో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు.


పుష్ప ది రైజ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు పుష్ప ది రూల్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 20 వ తేదీ నుండి పుష్ప ది రుల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప ది రూల్ మూవీ ని కూడా అద్భుతమైన భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: