హిందీ నటుడు
అక్షయ్ కుమార్ హీరో నటించిన లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ 'రామ్ సేతు'.
అభిషేక్ శర్మ దర్శకత్వం వహించాడు. కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ అబుడాంటియా ఎంటర్ టైన్ మెంట్స్
అమెజాన్ ప్రైమ్ వీడియో
లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.ఈ మూవీతో
టాలీవుడ్ హీరో సత్యదేవ్
బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. శ్రీలంకర్
బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బారుచా
హీరోయిన్ లుగా నటించారు.రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో తాజాగా మంగళవారం నాడు ఈ
మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు.
అక్టోబర్ 25న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో
దీపావళి సందర్భంగా
అక్టోబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు.
సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు.థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. రామ సేతుని ధ్వంసం చేయడానికి దుష్ట శక్తులు ప్లాన్ చేస్తున్న విజువల్స్ తో ట్రైలర్ మొదలైంది.
'ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తోంది. ఆ నమ్మకాన్ని నేను ఎలా సవాల్ చేయగలుగుతాను.. అంటూ నాజర్ వాయిస్.. ప్రభుత్వం వారు రామసేతుని కూల్చేందుకు సుప్రీం కోర్టు అనుమతిని కోరారు.. అంటూ లాయర్ చెబుతున్న డైలాగ్ లు
సినిమా కథ ఏంటో.. దేని పై సాగుతుందో స్పష్టం చేస్తున్నాయి.
ఇంత వరకు ఎవరూ టచ్ చేయని కథ ఇది. కంటెంట్ అందుకు సంబంధించిన విజువల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రామాయణ గాథలో రామ సేతు గురించి చాలా మంది విన్నారు. ఎవరు కట్టారన్నది పలు సినిమాల్లో .. పురాణాలలో చదివారు. అలాంటి ఆసక్తికరమైన అంశం నేపథ్యంలో 'రామ్ సేతు'ని తెరకెక్కించిన తీరు సినిమాపై ప్రతీ ఒక్కరిలోనూ అంచనాల్ని ఆసక్తిని పెంచేస్తోంది.
రామ్ సేతు విధ్వంసం ఎవరు చేయాలనుకుంటున్నారు?దాన్ని అరికట్టడానికి ఏర్పాటు చేసిన మిషన్ ఏంటీ?.. ఇందు కోసం మిషన్ ని మొదలు పెట్టిన సభ్యులు ఏం సాధించారు? భారతదేశ వారసత్వాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్నది ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో
మూవీ ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఖచ్చితంగా ఈ
మూవీ హిట్ అవ్వడం ఖాయమని అనిపిస్తుంది. మరి చూడాలి
బాలీవుడ్ ని ఈ
మూవీ అయిన కాపాడుతుందో లేదో.