కళ్యాణ్ రామ్ NKR -19 సినిమా అప్డేట్ ..!!
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల క్రేజీలో నటిస్తున్నాడు.కళ్యాణ్ రామ్ అందులో ఒకటి డెవిల్ , ఈ సినిమాలో ఒక బ్రిటిష్ ఏజెంటుగా కనిపించబోతున్నట్లు సమాచారం ఈ సినిమాకి డైరెక్టర్ నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలు షూటింగ్ జరుపుకుంటుంది ఇక ఈ మూవీ తో పాటు మైత్రి మూవీ బ్యానర్లు మరొక సినిమా చేయబోతున్నారు ఆ సినిమాకి NKR -19 అనే వర్కింగ్ టైటిల్ పేరుతో తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమాని డైరెక్టర్ రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో కళ్యాణ్రామ్ జోలిగా ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్నది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ ని గోవాలో జరుపుకున్నట్లుగా సమాచారం.ఇక దీంతో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు ఎండింగ్ దశకు చేరుకున్నట్లుగా తెలుస్తున్నది. త్వరలోనే ఈ సినిమా చివరి షెడ్యూల్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కు సంబంధించి పూర్తి వివరాలను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా వెళ్లదించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలకు కీలకమైన పాత్రలో బ్రహ్మాజీ, సప్తగిరి, రవి ప్రకాష్ తదితరులు నటించబోతున్నారు. మరి ఈ రెండు సినిమాలతో కూడా కళ్యాణ్ రామ్ సక్సెస్ను అందుకుంటారేమో చూడాలి.