అది జరిగి ఉంటే... బాహుబలి లో రాజమాత పాత్ర నేను చేసే దాన్ని....!!

murali krishna
చాలా గ్యాప్‌ తర్వాత సీనియర్‌ నటి, అలనాటి హీరోయిన్‌ జయచిత్ర మణిరత్నం పొన్నియన్‌ సెల్వన్‌లో మెరిశారు. 70, 80లలో గ్లామరస్‌ హీరోయిన్‌గా తెలుగు తెరపై అలరించిన వారిలో ఆమె ఒకరు.
శోభన్‌ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించి మెప్పించారు ఆమె. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన జయచిత్ర అత్త, తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇచ్చారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్న ఆమె తాజాగా పొన్నియన్‌ సెల్వన్‌లో ఓ ప్రధాన పాత్రలో కనిపంచారు. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జయచిత్ర తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కూడా స్టార్‌ హీరోలకు అత్త పాత్రలు వంటి పవర్ఫుల్‌ రోల్స్‌ చేసిన తనకు ఇప్పటికి ఓ అసంతృప్తి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓ సీరియల్‌లో నటించే అవకాశం కొల్పోయానంటూ జయచిత్ర వాపోయారు. 'నేను హీరోయిన్‌గా ఉన్నప్పుడు నాకు వచ్చిన సినిమాలు నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని. కానీ ఓ సీరియల్లో అవకాశం చేజారిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఆ సీరియల్ పేరు 'మంగమ్మగారి మనవరాలు'. దర్శకుడు రాఘవేంద్రరావుగారి ఫ్యామిలీకి చెందినవారే ఆ సీరియల్ చేశారు. ఆ సీరియల్‌కి సంబంధించిన విషయాలను మాట్లాడటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అదే సమయంలో నేను ఫోన్‌లో అదే సీరియల్ కథను వింటున్నాను' అని చెప్పారు.
''అయితే వచ్చిన వారిలో ఒకరు నా గురించి ఆసత్య ప్రచారం చేసి ఆ సీరియల్‌ అవకాశం పోయేలా చేశారు. నేను ఫోన్లో ఆ సీరియల్ కథ వింటుండగానే వచ్చిన వారిలో ఓ వ్యక్తి 'నేను సీరియల్‌ చేయనన్నాననీ, ఫారిన్ వెళ్లిపోయే ఉద్దేశంతో ఉన్నానని' అవతలివారికి చెప్పేశారు. రాజమౌళి గారి గెస్టు హౌస్‌లో ఉంటూ ఆ సీరియల్ చేయడానికి ఒప్పుకున్నప్పటికీ, రాఘవేంద్రగారికి లేనిపోనివి చెప్పారు. అలా ఆ ప్రాజెక్టులో నేను లేకుండా పోయాను. ఒకవేళ ఆ సీరియలక్లో నేను నటించి ఉంటే 'బాహుబలి' సినిమాలో రాజమాత పాత్ర నాకు దక్కి ఉండేదేమో. ఇన్ని సినిమాలు చేసిన నాకు ఒక సీరియల్ ఇలా మిస్సయిందే అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది'' అంటూ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: