ప్రభాస్ దర్శకుడు మారుతితో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారిక ప్రకటన కాకున్నప్పటికీ రాధే శ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు.దర్శకుడు మారుతితో మూవీ ఉంది. భిన్నమైన జోనర్, కామెడీ పాళ్ళు కూడా ఉంటాయని హింట్ ఇచ్చారు. పలు కారణాలతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఒకవైపు నుండి మారుతితో మూవీ వద్దని ఫ్యాన్స్ నుండి అభ్యర్ధనలు ఎక్కువవుతున్నాయి. ప్రభాస్ గత రెండు చిత్రాలు కొత్త దర్శకులతో చేసి దెబ్బతిన్నారు. సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచిన నేపథ్యంలో స్టార్ డైరెక్టర్స్ మాత్రమే ప్రభాస్ ఇమేజ్ తగ్గ చిత్రాలు చేయగలరని ఫ్యాన్స్ నమ్ముతున్నారుఈ క్రమంలో మారుతి మూవీ హోల్డ్ లో పెడితే బెటర్ అన్న వాదన వినిపిస్తున్నారు. ఈ పరిణామాలు మారుతి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అందులోనూ మారుతి లేటెస్ట్ రిలీజ్ పక్కా కమర్షియల్ దారుణ ఫలితం అందుకుంది. మరోవైపు ఆదిపురుష్ మూవీపై నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. టీజర్ చూసిన ఫ్యాన్స్ పూర్తి నిరాశ చెందారు. వారు దర్శకుడు ఓం రౌత్ ని తిట్టుకుంటున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రభాస్ ఎక్కడ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తాడో అనే భయం మారుతిని వెంటాడుతుంది.ఆదిపురుష్ విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంటే మారుతి ప్రాజెక్ట్ దాదాపు ఆగిపోయినట్లే. అప్ కమింగ్ దర్శకులతో చిత్రాలు చేయడం ఆయన ఆపేస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే ఆదిపురుష్ విడుదలకు ముందే ప్రభాస్ చిత్రం సెట్స్ పైకి తీసుకెళ్లాలనేది మారుతి ప్లాన్. దీని కోసం మారుతి భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ముందుగా రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసి షూటింగ్ మొదలుపెడతాడట. ప్రభాస్ సన్నివేశాలు పక్కన పెట్టి ఇతర నటులతో షూటింగ్ జరుపుతారట.ప్రభాస్ ఫ్రీ అయ్యాక ఆయన సన్నివేశాలతో పాటు కాంబినేషన్ సీన్స్ తెరకెక్కించాలనేది మారుతి ప్లాన్ గా తెలుస్తుంది. ఈ ప్రణాళికకు సంబంధించిన పనులు ఆల్రెడీ మారుతి మొదలుపెట్టాడట. జనవరి లోపు షూటింగ్ స్టార్ట్ చేస్తే ఆదిపురుష్ ఫలితం ఎలా వచ్చినా మారుతితో సినిమా చేయక తప్పదు. షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిన చిత్రాన్ని నిర్మాత కోసమైనా ప్రభాస్ కొనసాగిస్తాడు. ఈ ఆలోచనతో ప్రభాస్ మూవీ షూటింగ్ చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడట.