నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న తాజా సిని మా యొక్క టైటి ల్ ఇదేనంటూ ఈ సినిమా యొక్క టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుంది. నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షన్ నేపథ్యంలోని సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలు స్తూ ఉంటారు. ఆ విధంగా ఇప్పటిదాకా రెడ్డి అనే పేరు మీద ఎన్నో సినిమాలను రూపొందించిన నందమూరి బాలకృష్ణ ఆ సినిమాల ద్వారా సంచలన విజయాలను తన ఖాతాలో వేసు కున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆదే సెంటిమెంటును కొనసాగిస్తూ ఇప్పుడు గోపీచంద్ మ లినేని దర్శకత్వం లో చేస్తున్న సినిమాకు రెడ్డి అని టైటిల్ వచ్చే విధంగా ఆయన సినిమాకు టైటిల్ ను నిర్ణయించబోతున్నారట. తాజాగా ఈ సినిమాకు వీర సింహా రెడ్డి అనే సినిమా టైటిల్ నిర్ణయిం చబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాదాపుగా ఈ సినిమా కు ఇదే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది.
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుక గా విడుదల చేయాలని భావిస్తుంది. వాస్తవానికి ఈ సి నిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల ఈ సినిమా విడుదల కాలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా యొక్క షూటింగ్ వేగంగా జరుగుతూ ఉండటంతో అనుకు న్న సమయాన్ని షూటింగ్ పూర్తి చేయకపోవడంతో ఈ విధమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తూ ఉండగా ఈ చిత్రం నందమూరి అ భిమానుల కోసం మంచి ఎక్స్పీరియన్స్ తీసుకు వస్తుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అఖండ సినిమాతో తన జైత్ర యాత్రను కొనసాగించే విధంగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను చేయడం విశేషం.