పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు గత కొన్ని నెలలుగా చాలా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే పలు ప్రాజెక్టులు పెండింగ్లో ఉండడం వల్ల ఇక పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలను ఒప్పుకునే పరిస్థితిలో లేరని చెప్పవచ్చు. అయినా సరే కొంతమంది దర్శకులు పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు అలాంటివారిలో మహేష్ బాబుతో సర్కారీ వారి పాట తెరకెక్కించిన డైరెక్టర్ పరుశురాం కూడా ఒకరిని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి పలు కసరత్తులు కూడా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన సర్కారీ వారి పాట చిత్రం మహేష్ బాబు కు సక్సెస్ ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత డైరెక్టర్ పరుశురామ్ యువ హీరో నాగచైతన్యతో తన తదుపరి చిత్రాన్ని చేయవలసి ఉంది. ఆ సినిమాకి నాగేశ్వరరావు అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు. అయితే మహేష్ బాబు కారణంగా తన నతో చేయవలసిన ప్రాజెక్టును పక్కకు పెట్టడంతో చైతన్య ఇప్పటివరకు ఆ చిత్రాన్ని వెయిటింగ్ లిస్ట్ పెట్టారు. ప్రస్తుతం నాగచైతన్య తమిళ డైరెక్టర్ వెంకట ప్రభువుతో ద్విభాష చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇక చైతన్య వెంకట ప్రభుత్వం చేస్తున్న సమయంలో పరుశురామ్ పవన్ డేట్ల కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ కోసం టెర్రిఫిక్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒకవేళ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తనకి అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ అని పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరి ఆ తర్వాత తన తదుపరి చిత్రం ఎంటో చూడాలి.