జయాపజయాలతో సంబంధం లేకుండా తను నమ్మిన సిద్థాంతం ప్రకారం సినిమాలు చేసుకుంటూ పోతున్న నందమూరి హీరో కల్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మొదటి నుంచి కూడా కల్యాణ్ రామ్ కథల విషయంలో కొత్తగానే ఆలోచిస్తున్నాడు.ఇక అలా ఆలోచించడం వల్ల తనకు సక్సెస్ రాకపోయినా.. హీరోగా తనకంటూ ఓ కొత్త ఇమేజ్ ను మాత్రం క్రియేట్ చేసుకున్నాడు కల్యాణ్ రామ్. అయితే ఈ మధ్య కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చాలా కాలం తరువాత ఆయనకు బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందించింది.ఇక ఈసినిమాతో ఆయన చేసిన ప్రయోగం ఫలించింది. అటు హీరోగా ..
నిర్మాతగా ఈ సినిమా ఆయనకి భారీ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఆ జోష్ తోనే కల్యాణ్ రామ్ బింబిసార సీక్వెల్ కు రెడీ అవుతున్నాడు. అయితే ఇక ఈలోపు కల్యాణ్ రామ్ మరో సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. కాగా ఈసినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కెరియర్ పరంగా కల్యాణ్ రామ్ కి ఇది 19వ సినిమా. ఇక మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ కంప్లీట్ అయ్యిందట. ఇందులో మరో విశేషం ఏంటీ అంటే.. నందమూరి హీరో ఇందులో మూడు పాత్రల్లో నటించబోతున్నాడట.ఇదిలా ఉంచితే రీసెంట్ గా గోవా షెడ్యూల్ ను పూర్తిచేసిన టీమ్, చివరి షెడ్యూల్ షూటింగుకి రెడీ అవుతున్నారు టీమ్.
ఇక రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అయితే ఈ మూడు పాత్రల మధ్య వేరియేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు.ఇక కల్యాణ్ రామ్ ఇలా మూడు పాత్రలను పోషించడం ఇదే మొదటిసారి. అయితే ఈ మూడు పాత్రలు కూడా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని ఆకట్టుకుంటాయని అంటున్నారు.ఇకపోతే ఈ సినిమా కథ ప్రకారం టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఎమిగోస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు దాదాపుగా ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో మరో హిట్టు ఎలాగైనా కొట్టాలని చూస్తున్నాడు కల్యాణ్ రామ్.అయితే చాలా కాలం పెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ నందమూరి హీరోకు మంచిరోజులు వచ్చాయని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు..!!