విడాకులు తీసుకోబోతున్న తమిళ స్టార్ హీరో.. కారణం ఏంటంటే..?

Anilkumar
ఈ మధ్య కాలంలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ద్వారా  తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ధనుష్ ఐశ్వర్య, నాగచైతన్య సమంతల విడాకుల గురించి ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుండగా విజయ్ ఆంటోనీ కూడా విడాకులు తీసుకోనున్నారని తెలుస్తోంది.ఇకపోతే విజయ్ ఆంటోని డైరెక్ట్ గా ఈ విషయాన్ని వెల్లడించకపోయినా తన పోస్ట్ ద్వారా ఈ విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చింది.అయితే ఇక తన సోషల్ మీడియా అకౌంట్ లో మీ ఫ్యామిలీలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను మీలో మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని విజయ్ ఆంటోని అన్నారు. 


ఇక అది వీలు కాని పక్షంలో ఎవరి దారి వారు చూసుకోవాలని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. అయితే అవసరం అనుకుంటే మరొకరి కాళ్లు మొక్కి రాజీకి రావాలని విజయ్ ఆంటోని సూచనలు చేశారు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తిని మాత్రం మీ జీవితాల్లోకి రానీయొద్దని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు.ఎందుకంటే ఇక  మూడో వ్యక్తి జీవితంలోకి వస్తే వాళ్లు మిమ్మల్ని నాశనం చేసి సంతోషిస్తారు అని విజయ్ ఆంటోని కామెంట్లు చేశారు.అయితే విజయ్ తన భార్యతో విడాకులు తీసుకోనున్నారని అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


 ఇదిలావుంటే ఇక ప్రస్తుతం విజయ్ ఆంటోని అగ్ని సిరగుగల్ అనే సినిమాలో నటిస్తున్నారు.కాగా  నవీన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇకపోతే రథం, కొలై మరికొన్ని ప్రాజెక్ట్ లు సైతం విజయ్ ఆంటోని చేతిలో ఉన్నాయి. అయితే విజయ్ ఆంటోని వ్యక్తిగత జీవితం వివాదాల్లో చిక్కుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.ఇదిలావుంటే ఇక  మరోవైపు ఈ మధ్య కాలంలో విజయ్ ఆంటోని నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదు. కాగా విజయ్ ఆంటోని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: