మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే అలరించింది. చాలామంది ఈ సినిమా విషయంలో పెదవి విరిచారనే చెప్పాలి. రివ్యూ దగ్గర నుంచి యూట్యూబ్ ల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా గురించి నెగటివ్ ప్రచారం చేసిన వారే. కారణం ఏదైనా కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో నటించిన ఈ సినిమాకు ఇలాంటి ప్రచారం జరగడం నిజంగా ఎన్నో అనుమానాలను గురిచేస్తుంది అని చెప్పాలి.
కారణం ఏదైనా గాడ్ ఫాదర్ సినిమా ఓ మోస్తరు గానే ప్రేక్షకులను మెప్పించింది అని చెప్పాలి.దాంతో ఈ సినిమా కలెక్షన్లపై తప్పకుండా ప్రభావం పడుతుందని ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ మొదటి వారాంతంలో ఈ సినిమా యొక్క కలెక్షన్లు చూస్తుంటే ఫ్లాప్ అని హెప్పిన వారిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది అని చెప్పాలి. కొంతమంది ట్రేడ్ పండితులు ఇలాంటి టాక్ తో వచ్చిన సినిమాలు ఇన్ని కలెక్షన్లను అందుకోవడం నిజంగా కొంతమంది హీరోలకే సాధ్యమవుతుంది. అందులో మొదటగా ఉండే హీరో మెగాస్టార్ చిరంజీవి అని వారు చెబుతున్నారు. ఏదేమైనా గాడ్ ఫాదర్ సినిమా యొక్క కలెక్షన్లు బాగా రావడం ఆ నిర్మాతను ఎంతో సంతోషపడుతుంది అనే చెప్పాలి.
ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ మరొక హీరోగా నటించడం జరిగింది. హిందీలో ఆయన వల్ల ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి. కలెక్షన్ల పరంగా కూడా హిందీలో తెలుగుకు ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్లు వచ్చాయి. మరి ఈ విధమైన కలెక్షన్స్ రావడం అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోయే మెగాస్టార్ చిరంజీవి సినిమాలు తప్పకుండా అందరినీ అలరిస్తాయని చెబుతున్నారు. భోళా శంకర్ సినిమాను ఇప్పటికే విడుదలకు సిద్ధం చేసిన మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలోని తెరకెక్కుతున్న సినిమా యొక్క షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నాడు.