వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల శివ డైరెక్ట్ చేసిన "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "గాడ్ ఫాదర్" సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చారు.తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన "లూసిఫర్" అనే సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది.కానీ తాజాగా సినిమా మొదటివారం వసూలు చేసిన కలెక్షన్లు చూస్తుంటే మాత్రం సినిమా ను హిట్ గా కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు. అయితే టికెట్ రేట్లు పెంచకపోవడం వల్ల 10 శాతం కలెక్షన్లు తగ్గిపోయాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సినిమా విడుదలైన 6, 7 రోజులు కలిపినా కూడా కలెక్షన్లు కేవలం 2.17 కోట్లు మాత్రమే నమోదు చేసుకుంది సినిమా.
మొదటివారం పూర్తయ్యేసరికి సినిమా కలెక్షన్లు 49.5 కోట్లుగా తెలుస్తోంది.ఎంత మంచి హిట్ టాక్ వచ్చినప్పటికీ సీనియర్ స్టార్ హీరో సినిమా మొదటివారం 50 కోట్లు కూడా దాటకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం షాక్ కి గురిచేస్తుంది. ఇక సినిమా ఫైనల్ రన్ లోపల కలెక్షన్లు 60 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ సినిమా రైట్స్ 90 కోట్లకు అమ్ముడయ్యాయి కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా చేరుకోలేక ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.దీంతో ఈ సినిమా కూడా ఆచార్య సినిమా లాగా నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టడం పక్కా అని తెలుస్తుంది. మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో..ఇక చిరు తాజాగా పూరి జగన్నాథ్ తో సినిమా చేసేందుకు రెడీగా వున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో తెలియాలి.