సిద్ధార్థ్, కియారా పెళ్లి కన్ఫర్మ్?

Purushottham Vinay
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ కొంతకాలంగా విచ్చల విడిగా ఎంజాయ్ చేస్తూ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు ఉన్నాయి. అయితే 'కాఫీ విత్ కరణ్ 7'లో ఇదే ప్రశ్న అడిగినప్పుడు కియారా జవాబు వేరుగా ఉంది. తాము స్నేహితుల కంటే ఎక్కువ అని మాత్రమే చెప్పింది. అయితే ఎంత ఎక్కువ? అన్నదానికి క్లారిటీ నివ్వలేదు. కియారాతో కలిసి షోలో కనిపించిన షాహిద్ కపూర్ ''ఈ సంవత్సరం చివరి నాటికి పెద్ద ప్రకటన వస్తుంది.. అది సినిమా కాదు.. నిజం!'' అంటూ కవ్వింపుగా అన్నారు. కియారా ఇంకా సిద్ధార్థ్ పెళ్లిలో 'డోలా రే డోలా'కి డ్యాన్స్ చేస్తారని షాహిద్ కపూర్ కరణ్ జోహార్ చర్చించుకున్నారు.తాజా గాసిప్స్ ప్రకారం.. వాటన్నింటిలో ఒక నిజం ఉందని తెలిసింది. కియారా, సిద్ధార్థ్ ఏప్రిల్ 2023లో వివాహం చేసుకోబోతున్నారు.  బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం... ఈ జంట నిండా ప్రేమలో మునిగి ఉన్నారు. వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. సిద్, కియారా ఇప్పుడు ఒకరినొకరు విడిచి ఉండలేకపోతున్నారు.వారి రిలేషన్ గురించి వారు బహిరంగంగా చెప్పకపోయినా కలిసి ఉన్నారన్నది నిజం అని చెబుతున్నారు.

సిద్ధార్థ్ కుటుంబం ఢిల్లీలో ఉంది. పెళ్లి అక్కడే జరగనున్నందున బాలీవుడ్ నుండి ఎవరినీ పెళ్లికి ఆహ్వానించరు. ఈ జంట మొదట రిజిస్టర్ మ్యారేజీని చేసుకుంటారు. ఆ తర్వాత కాక్ టెయిల్ పార్టీ ఉంటుంది. రిసెప్షన్ ను భారీగా జరుపుకుంటారు. అయితే రిసెప్షన్ కు బాలీవుడ్ లోని వారి స్నేహితులను ఆహ్వానిస్తారా? ఢిల్లీకి పిలుస్తారా? అనేది ఇంకా ఖచ్చితంగా తెలియరాలేదు.'షేర్షా' ప్రమోషన్స్ లో ఆ ఇద్దరినీ కలిసి చూసినప్పటి నుండి సిద్ధార్థ్ - కియారా మధ్య ఏదో జరుగుతోందని చర్చ సాగింది. కానీ కియారా 'కాఫీ విత్ కరణ్ 7'లో  ఒప్పుకుంది. ఈ చిత్రానికి చాలా ముందు నుండి తనకు సిద్ తెలుసు. వారు ఒక పార్టీలో కలుసుకున్నారు. ఈ కపుల్ మొన్న సోమవారం రాత్రి కూడా నిర్మాత అశ్విని యార్డి పుట్టినరోజు వేడుకలో జంటగానే కనిపించారు.దీంతో ఖచ్చితంగా వీరు పెళ్లి కన్ఫర్మ్ అన్నట్లు వార్తలొస్తున్నాయి.కియారా సూపర్ స్టార్ మహేష్ బాబు "భరత్ అను నేను" సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ సినిమాలో నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: