ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చిన ఊర్వశి రౌతేలా...!!
ఆమె ఏమైనా మాట్లాడినా, ఏదైనా పోస్ట్ పెట్టినా.. హెడ్లైన్స్లోకి వచ్చేస్తోంది. రీసెంట్గా తాను ఆస్ట్రేలియాకు పయనప్పుడు.. 'నా ప్రేమని అనుసరిస్తూ, ఆస్ట్రేలియాకి చేరుకున్నాను' అంటూ ఒక పోస్ట్ కూడా పెట్టింది. అంతే, ఆ క్షణం నుంచి 'స్టాకర్' అంటూ ఒకటే ట్రోల్ చేస్తున్నారు. రిషభ్ పంత్‌ని ఉద్దేశించే ఊర్వశీ ఆ పోస్ట్ పెట్టిందని, అతడ్ని స్టాక్ చేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పంత్‌కు ఇష్టం లేకున్నా, అతడ్ని ఎందుకు ఫాలో అవుతున్నావంటూ కూడా ఏకిపారేస్తున్నారు.
ఈ విమర్శలకు ఊర్వశీ తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ''మొదట ఇరాన్లో, ఇప్పుడు మన ఇండియాలో.. నన్నే ప్రతీసారి నిందిస్తున్నారు. నేను ఎవ్వరినీ కించపరచలేదు. ఏ వ్యక్తికీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అయినా, నన్నే అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు'' అంటూ ఊర్వశీ ఆవేదన వ్యక్తం చేశారట. అసలు స్టాకర్ అర్థం ఏంటో తెలుసుకోండి అంటూ.. గూగుల్‌లో స్టాకర్ పదానికి నిర్వచనానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని షేర్ చేసింది. దానికి #StopBullyingWomen అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేసిందట. అనంతరం ఆస్ట్రేలియా మ్యాప్ షేర్ చేస్తూ.. ''ఇది మన భారత మీడియా కోసం, చూడండి ఆస్ట్రేలియా దేశం ఎంత పెద్దగా ఉందో'' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిందట . అంటే, తాను ఆస్ట్రేలియాకు వెళ్లింది రిషభ్ పంత్ కోసం కాదని పరోక్షంగా క్లారిటీ అయితే ఇచ్చిందన్నమాట!
కాగా.. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు పయనమైన మరుసటి రోజే ఊర్వశీ రౌతేలా ఆస్ట్రేలియాకు పయనమైంది. ఈ సందర్భంగా.. ఫ్లైట్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, 'నా ప్రేమను ఫాలో అవుతూ ఆస్ట్రేలియా చేరుకున్నా' అనే పోస్ట్ పెట్టింది. దానికి స్టాకర్ అంటూ రిషభ్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వగా, అందుకు పై విధంగా కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆస్ట్రేలియా అందాల్ని ఆస్వాదిస్తోందట .