ఫేమ్ రాహుల్ కోహ్లి కన్నుమూత.. వైద్యం కోసం రిక్షా అమ్మినా.. మూవీ రిలీజ్కు ముందు మృతి...!!
బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటంచిన్నతనం నుంచే నటనపై ఆసక్తి పెంచుకొన్న రాహుల్ కోహ్లీ గుజరాత్‌లోని జామ్‌నగర్ జిల్లాలోని హపా పట్టణంలో రిక్ష్మా తొక్కుకొని జీవించే కుటుంబంలో జన్మించాడు. గత కొద్దికాలంగా లుకేమియా అనే బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు. అయితే మృత్యువుతో చేసిన పోరాటంలో అలిసిపోయిన రాహుల్ కోహ్లి శాశ్వత నిద్రలోకి జారుకొన్నాడు.
అనారోగ్యం నుంచి కోలుకోలేకపోవడంతో
రాహుల్ కోహ్లీ అనారోగ్యం గురించి తండ్రి రాము కోహ్లీ మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. తొలుత తీవ్ర జ్వరంతో బాధపడేవాడు. జ్వరంతో బాధపడుతున్న నా కుమారుడికి పలు రకాల చికిత్సలు చేయించాం. కానీ అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయవడంతో తొలుత జామ్ నగర్, ఆ తర్వాత ఆహ్మాదాబాద్ హాస్పిటల్‌లో చికిత్స చేయించాం. అప్పుడే లుకేమియా వ్యాధి గురించి మాకు తెలిసింది అని తెలిపారు.
రిక్షాను అమ్మి వైద్యం
గత నాలుగు నెలలుగా లుకేమియా వ్యాధితో తీవ్రమైన పోరాటం చేస్తున్న రాహుల్ కోహ్లీకి ట్రీట్‌మెంట్ అందించారు. నా కొడుకును బతికించుకొనేందుకు రిక్షాను కూడా అమ్మి వైద్యం చేయించాం. అక్టోబర్ 2వ తేదీన తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. మూడుసార్లు రక్తపు వాంతులు చేసుకొన్నారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఈ లోకం నుంచి వెళ్లిపోయాడు అని తండ్రి రాము కోహ్లీ శోకసంద్రంలో మునిగిపోయాడు.
అక్టోబర్ 14వ తేదీన రిలీజ్
ఛెల్లో షో చిత్రం అక్టోబర్ 14వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా రిలీజ్ సమయంలో మా అబ్బాయి లేకపోవడం బాధాకరంగా ఉంది. మా కుటుంబం అంతా సినిమా చూస్తాం. ఆ తర్వాత మా అబ్బాయి మరణానికి సంబంధించిన తుది కార్యక్రమాలను పూర్తి చేస్తాం. ఈ చిత్ర యూనిట్ మాకు రిక్షాను తిరిగి ఇప్పించారు.
రాహుల్‌ను బతికించుకోలేకపోయాం
ఛెల్లో షో సినిమాలో మొత్తం ఆరుగురు బాలనటులు నటించారు. అందులో రాహుల్ కోహ్లి ఒకరు. మను అనే పాత్రలో రాహుల్ కనిపించాడు. చాలా టాలెంటెడ్ కుర్రాడు. రాహుల్ ఇక లేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నాం. గత కొద్దివారాలుగా రాహుల్ మెరుగైన వైద్యాన్ని అందించేలా కుటుంబంతో ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తూ రాహుల్‌ను బతికించుకోలేకపోయాం అని ఛెల్లో షో దర్శకు, నిర్మాత, రచయిత పాన్ నలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.