ఈ సినిమా నాగచైతన్య..కృతి శెట్టి కెరియర్ మార్చేనా..?
ఇక ఇందులో చైతన్య ఒక పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ గా మారుతోంది. ఈ సినిమాకి 302 అనే టైటిల్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాదాపుగా ఈ టైటిల్ ని ఫిక్స్ చేయాలని చిత్ర బృందం కూడా చాలా ఆత్రుతగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో చైతన్య పాత్ర స్టోరీ కథ ఆధారంగా ఈ టైటిల్ని నిర్ణయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.
యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కథ అంశంతో ఈ సినిమా తెరకెక్కించడమే కాకుండా ఇందులో ఎన్నో ట్విస్టులు కూడా ఉంటాయని చిత్ర బృందం తెలియజేస్తోంది. ఈ చిత్రానికి టైటిలే చాలా బలమైన ఇండికేషన్ అని తెలియజేస్తున్నారు. నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ అయిన ఇందులో యూనిఫాంలో కనిపించేది చాలా తక్కువ అని అందుచేతనే ఇలాంటి టైటిల్ ని పెట్టినట్లు సమాచారం. కోలీవుడ్ మీడియా నుంచి అందుతున్న ప్రకారం ఇందులో కోలీవుడ్ నటుడు జీవి పాత్ర, ప్రియమణి పాత్ర కూడా చాలా పోటీ పోటీగా ఉంటుందని సమాచారం. మరీ చిత్రంతోనైనా నాగచైతన్య , కృతి శెట్టి కెరియర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి.