వీడని చిక్కుముడుల మధ్య అన్ ష్టాపబుల్ !

Seetha Sailaja
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అన్ ష్టాపబుల్ 2’ షో ఈరోజు నుండి ఆహా లో స్ట్రీమ్ అవ్వడం ప్రారంభం అయింది. ఈ షోకి సంబంధించిన మొదటి ఎపిసోడ్ ఒక ఫిలిం సెలెబ్రెటీ లతో కాకుండా ఒక ప్రముఖ రాజకీయ వేత్తతో ప్రారంభం కావడం ఈకార్యక్రమం స్పెషాలిటీ. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఎవరికీ తెలియని చాల సరదా విషయాలు బాలకృష్ణ తనదైన శైలిలో తన బావ నుండి రాబట్టాడు.


ఈ ఎపిసోడ్ కు ఎలాంటి రేటింగ్స్ వచ్చాయి అన్నవిషయం మరో రెండు రోజులకు కాని తెలియదు. వాస్తవానికి ‘ఆహా’ యాజమాన్యం ఈషోకి సంబంధించిన సెకండ్ సీజన్ లో ఏదోవిధంగా చిరంజీవి బాలకృష్ణ లను కలపాలని చాల గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ చిరంజీవి నుండి సానుకూల స్పందన రాకపోవడంతో ఈవ్యవహారం ముందుకు వెళ్ళలేదు అని కొందరు అంటున్నారు.


అయితే మరికొందరు మాత్రం చిరంజీవితో ఇంటర్వ్యూ చేయడానికి బాలకృష్ణ పెద్దగా ఆశక్తికనపరచలేదు అన్న గాసిప్స్ కూడ ఉన్నాయి. ఈవిషయంలో అసలు నిజం ఏమిటి అన్నది ఒక్క ఆహా యాజమాన్యానికి మాత్రమే తెలుసు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బాలయ్య ఈషోలో పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ లను కలిపి ఈషో కోసం ఇంటర్వ్యూ చేయాలని ఆహా యాజమాన్యం ద్వారా ప్రయత్నించినప్పటికీ అది ఎందుకనో ముందుకు వెళ్ళలేదు అన్న గాసిప్పులు కూడ వస్తున్నాయి.


దీనితో టాప్ సీనియర్ హీరోలు బాలయ్య షోకు దూరంగా ఉంటున్నారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. ఈషోలో నందమూరి అభిమానులు కలలు కంటున్నా జూనియర్ బాలయ్యల ఎపిసోడ్ ఇక లేనట్లే అన్న వార్తలు కూడ వస్తున్నాయి, ఈషోలో బాలయ్య ఒక్క ఆటాడుకునేది కేవలం యంగ్ హీరోలు మాత్రమేనా అన్న సందేహాలు కూడ కొందరు వ్యక్తపరుస్తున్నారు. అదే జరిగితే ఈ సెకండ్ సీజన్ షోకు ఫాస్ట్ సీజన్ కు వచ్చినంత స్పందన ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాలు కూడా అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి..





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: