రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లలో విడుదల కానున్న "కాంతారా" మూవీ..!

Pulgam Srinivas
భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 30 వ తేదీన కాంతారా అనే కన్నడ సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు.  కిషోర్ , అచ్యుత్ కుమార్ , ప్రమోద్ శెట్టి , సంపత్ గౌడ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ కన్నడ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి అద్భుతమైన బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకొని ,  ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది.


ఇలా ఇప్పటికే కన్నడ ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో తెలుగు ప్రేక్షకులను కూడా అలంకరించబోతుంది. ఈ మూవీ ని తెలుగు లో అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నారు.  ఈ మూవీ ని తెలుగుvలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన తెలుగు ప్రచార చిత్రాలను కొన్నింటిని మూవీ యూనిట్ విడుదల చేయగా ,  వీటికి అద్భుతమైన రెస్పాన్స్ తెలుగు ప్రేక్షకుల నుండి లభిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కన్నడ లో అద్భుతమైన విజయం సాధించడంతో ,  ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.


ఇలా ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి భారీ మొత్తం థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్ లలో విడుదల కాబతుందో తెలుసుకుందాం.
నైజాం :  115 ప్లస్ .
సీడెడ్ : 50 ప్లస్ .
ఆంధ్ర :  140 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కాంతారా మూవీ 305 థియేటర్ లలో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: