సినీ రంగంలోని వ్యక్తుల పెళ్ళిళ్ళు.. విడాకులు.. సర్వ సాధారణం. ఈ జనరేషన్ అనే కాదు.. నలభై, యాభై ఏళ్ళ క్రితం కూడా సినీ రంగంలో పెళ్ళిళ్ళు, విడాకులు వెరీ కామన్‌గా కనిపించేవి.అయితే, ఓసారి విడిపోయిన జంటలు మళ్ళీ జత కట్టడం అనేది అత్యంత అరుదుగా జరిగేది. తాజాగా ఇటు
టాలీవుడ్, అటు కోలీవుడ్లోను విడి పోయిన రెండు జంటలు మళ్ళీ కలుస్తున్నట్లుగా సిగ్నల్స్ ఇస్తుండడం ఆసక్తి రేపుతోంది. వారి ఫ్యాన్స్‌ను ఆనందోత్సాహంలో ముంచెత్తిస్తోంది. ఆ జంటలెవరో ? వారెలాంటి సిగ్నల్స్ ఇస్తున్నారో .. తెలుసుకుందాం పదండి.సామ్ మళ్లీ… వెనక్కి చూస్తున్నారా. ? మళ్లీ చై చెంతకు వస్తున్నారా? విడాకులకు ముందు హింట్ ఇచ్చినట్టే.. మళ్లీ కలుస్తామనే హింట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా? ఇంతకీ
సమంత ఏం చెబుతున్నారు.? ఏం చెప్పాలని అనుకుంటున్నారు.? ఈ ప్రశ్నలిపుడు టాలీవుడ్లో మార్మోగుతున్నాయి. ఒకరు స్టార్
హీరో వారసుడు.. ఇంకోరు సాదాసీదా మధ్య తరగతి ఫ్యామిలీ నేపథ్యం ఉన్నవారు. వీరిద్దరూ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు
ఏం మాయ చేసావే తో ఏకం అయ్యారు.
గౌతమ్ మీనన్ విజన్‌ను ఆవిష్కరిస్తూ.. సిల్వర్ స్క్రీన్ పై బెస్ట్ కపుల్ అని అనిపించుకున్నారు. ఆ తరువాత కెరీర్లో ఎవరికి వారు దూసుకుపోతూనే.. ఎవ్వరికీ తెలియకుండా ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఓ ఫైన్ డే ఈ విషయం చెప్పి అందర్నీ షాక్ చేశారు. పెళ్లిచేసుకుంటున్నామంటూ.. నెట్టింట వైరల్ అయ్యారు.ఇక అదే సోషల్ మీడియాలో తన
భర్త ఇంటి పేరును తొలిగించి తమ విడాకులు తప్పవనే హింట్ ఇచ్చారు సమంత. ఇక ఆ తరువాత అఫీషియల్ గా ఆ విషయాన్ని చెప్పి.. తమ మధ్య ఉన్న గొడవల గురించి అందరికీ తెలిసేలా చేశారు. వరుస ఆఫర్లతో ఇద్దరూ ఆ బాధను మరచి..ఇద్దరూ మామూలవటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇప్పుడు
టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది. తిరిగి
సమంత -
చైతన్య ఒక్కటి అయ్యే అవకాశం ఉందనేది దాని సారాంశం. విడాకుల తరువాత పలు ఇంటర్వ్యూలకు హాజరైన
సమంత బాగా ఎమోషనల్ గా కనిపించారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లి వచ్చారు. ఇక, కొద్ది రోజుల క్రితం బంగార్రాజు
మూవీ విడుదలకు ముందు
నాగ చైతన్య సైతం తామిద్దరం విడిపోయినా.. ఎవరికి వాళ్లుబాగానే ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. వరుస ఆఫర్లతో ఇద్దరూ ఆ బాధను మరచి..ఇద్దరూ మామూలవటానికి ప్రయత్నిస్తున్నారు.అయితే, ఇప్పుడు
టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది. తిరిగి
సమంత -
చైతన్య ఒక్కటి అయ్యే అవకాశం ఉందనేది దాని సారాంశం. గతంలో సామ్
ఇన్స్టాగ్రామ్ నుంచి విడాకుల ప్రకటనను తొలగించింది. తాజాగా
సామ్ టీషర్ట్ ధరించి సెల్ఫీ దిగింది. అక్కడ తన ఫేస్ కనిపించకుండా, కేవలం టీ షర్ట్ రాసి ఉన్న 'యూ విల్ నెవర్ వాక్ ఎలోన్' అనే కోట్ని హైలెట్ చేసింది. దీంతో అనుమానుల బలపడుతున్నాయి. అది లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ సేయింగ్ అయినప్పటికీ
సామ్ ప్రత్యేకంగా పోస్ట్ పెట్టడంతో
నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.సమంత 'పుష్ప'లో స్పెషల్ సాంగ్ చేసి అదరహో అనిపించింది. ప్రస్తుతం ఆమె పాన్
ఇండియా మూవీ యశోద, శాకుంతలం లతో పాటు ఓ హాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. బడా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్లో కూడా మూడు చిత్రాలు చేసేందుకు సైన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఈ సమయంలోనే వారిద్దరి కలిసి చూడాలనేది అభిమానుల ఆశ. మరి..ఇప్పుడు మొదలైన ప్రచారం వాస్తవ రూపం దాల్చుతుందా.. లేక, ప్రచారానికే పరిమితం అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.అటు
ధనుష్ దంపతులు కూడా..
ఇక అటు
తమిళ స్టార్
హీరో ధనుష్‌కు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఫాలోయింగ్ ఉంది. సౌత్ టూ నార్త్ వరుస లు చేస్తూ అగ్రకథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ధనుష్. అయితే ఈ ఏడాది ప్రారంభంలో తాను తన సతీమణి
ఐశ్వర్య రజినీకాంత్‌తో విడాకులు తీసుకున్నట్లు అనౌన్స్ చేసి షాకిచ్చాడు. దాదాపు 18 ఏళ్ల వివాహ బంధానికి వీరిద్దరు ముగింపు పలుకుతున్నట్లు సోషల్
మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం షాకయ్యారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట డివోర్స్ తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. విడాకుల ప్రకటన అనంతరం ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయ్యారు.
ధనుష్ లతో బిజీ కాగా.. చాలా
కాలం తర్వాత దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు ఐశ్వర్య. అయితే ఈ జంట తిరిగి కలిసిపోతున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. పిల్లల కోసం వీరిద్దరు మళ్లీ కలుస్తున్నారని ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి.
ధనుష్ ,
ఐశ్వర్య మధ్య మనస్పర్థలు తొలగించేందుకు.. పెద్దలు సమస్యను పరిష్కరించారని తెలుస్తోంది. దీంతో ఈ జంట విడాకుల ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్.. ఆమె కుటుంబ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల్లో పెద్దల మాటలను గౌరవిస్తూ సానుకూల నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇక ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.2004లో
రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను
ప్రేమ వివాహం చేసుకున్నారు ధనుష్. వీరికి
యాత్ర రాజా, లింగరాజా ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం
ధనుష్ వరుస లతో బిజీగా ఉన్నారు. ఇటీవల నానే వరవేన్, తిరుచిత్రంబలం లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ రెండు లు
బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం ధనుష్..
డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేస్తున్నారు.
డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి..