రజినీకాంత్ ని ఎలా పడగొట్టాడబ్బా!!
అసలు ఒకప్పటి మణిరత్నం లా కనపడి చాలా రోజులే అయిపొయింది అని చెప్పాలి. ఆ విధంగా రజినీకాంత్ తో ఈ దర్శకుడు దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత సినిమా చేస్తుండడం విశేషం. భారీ బడ్జెట్, భారీ తారగణంతో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమా ను మణిరత్నం డీల్ చేసిన విధానం చాలాబాగుంది. అందుకే ఆయనకు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యిందని చెప్పాలి. ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ ముందు రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే మణిరత్నం రజినీకాంత్ తో ఎప్పుడు సినిమా చేస్తాడో అన్న విషయం ఇప్పుడు కొంత అయోమయంగా ఉంది. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు మణిరత్నం.
ఈ సినిమా పూర్తవ్వాలంటే చాలా సమయమే పడుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి చేయబోయే సినిమాకు ఎంత సమయం పడుతుందో చూడాలి. అసలే వరుస పరాజయాలతో వచ్చిన ఈ విజయంతో మణిరత్నంలో మరోసారి కమ్‌బ్యాక్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.హిట్ డైరెక్టర్ తో చేయడానికి ఏ హీరో కి అభ్యంతర ఉంటుందో చెప్పండి. మరి జైలర్ తర్వాత రజినీకాంత్ ఒప్పుకున్న సినిమాలేవీ లేని నేపథ్యంలో మణిరత్నం తో సినిమా చేస్తాడా అనేది చూడాలి. వీరి కలయిక లో ముప్పై ఏళ్ల క్రితం దళపతి సినిమా వచ్చి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
తాజా సమాచారం ప్రకారం మణిరత్నం, రజినీకాంత్ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుందని తమిళ సినీ ఇండస్ట్రీలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. రజనీ ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ రెండు సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం. వీటిలో ఒకటి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కానుకండగా మరో చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే రజినీ చిత్రాన్ని మొదలు పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది.