రామ్ చరణ్ ఫాన్స్ కి చిరాకు రప్పిస్తున్న డైరెక్టర్ శంకర్...!!
ఇంకా టైటిల్ ఖారారు కానీ ఈ సినిమా షూటింగ్ 50 శాతం కి పైగానే పూర్తి అయ్యింది..ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు..ఇప్పటి వరుకు ఫస్ట్ లుక్ రాకపోయినప్పటికీ కూడా..షూటింగ్ స్పాట్ నుండి లీకైన కొన్ని ఫోటోలు అభిమానులను పిచ్చెక్కేలా చేస్తున్నాయి..అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త మెగా అభిమానులకు చిరాకు కలిగించేలా చేస్తున్నాయి..అసలు విషయానికి వస్తే ఈ చిత్రం షూటింగ్ ని డిసెంబర్ నెలలోపు పూర్తి చేసి, సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసారు దర్శక నిర్మాతలు..అయితే అనుకోని విధంగా మధ్యలో కమల్ హాసన్ తో సగం తెరకెక్కించి మధ్యలో ఆపేసిన 'ఇండియన్ 2' చిత్రం షూటింగ్ ని శంకర్ తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది.
దీనితో కొన్ని రోజులు ఇండియన్ 2 మరికొన్ని రోజులు #RC15 సెట్స్ కి అటు ఇటు తిరుగుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు శంకర్..రెండిటికి మంచి ఔట్పుట్ రావడానికి ఆయన శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు..అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం #RC15 కంటే ముందుగా 'ఇండియన్ 2 ' నే థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్నట్టు తెలుస్తుంది..ఇండియన్ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేయబోతున్నారట.
ఇక #RC15 సినిమాని 2024 సంక్రాంతి కి దింపే ఆలోచనలో ఉన్నాడట శంకర్..ఇదే విషయాన్నీ దిల్ రాజు కి కూడా తెలిపాడట..దీనితో ఈ ప్రాజెక్ట్ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మెగా ఫాన్స్ కి చిరాకు కలిగింది..దానికి తోడు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా ఇప్పటి వరుకు విడుదల చెయ్యకపోవడం తో మరింత అసహనం లో ఉన్నారు అభిమానులు.