త్రిష పై మనసు పారేసుకున్న దర్శకుడు ఎవరో తెలుసా.

murali krishna
హీరోయిన్ త్రిష ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీకి కాస్త దూరంగా నే ఉన్నది. కానీ ఆమెకు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టింది మాత్రం తెలుగు సినిమాలే అని చెప్పవచ్చు

గతంలో త్రిష చూసేందుకు బక్క పలుచగా, బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో కనిపించేది. ఈ అమ్మడుని ఇండస్ట్రీలో చాలా మంది నల్లగా ఉంటుందని ఎగతాళి చేసేవారని తెలిసింది. తెలుగులో నీ మనసు నాకు తెలుసు మూవీతో త్రిష టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. త్రిష లవర్ బాయ్ తరుణ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వగా.. అది ఆశించినంత పేరు  త్రిష తెచ్చుకోలేదు.

ఇక అదే టైంలో దర్శకుడు ఎంఎస్ రాజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కోసం కొత్త హీరోయిన్‌ను వెతుకుతున్నారు. ఆ టైంలోనే త్రిషను చూసి ఆమెను ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అప్పటికే మనసంతా నువ్వే, నీ స్నేహం, ఒక్కడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు ఎంఎస్ రాజు. త్రిషను పెట్టిన తీసిన వర్షం సూపర్ హిట్ అవ్వడంతో ఆమెతోనే మరో రెండు సినిమాలు ప్లాన్ చేశాడు.ఇదే విషయంపై త్రిష దగ్గరకు వెళ్లి డేట్స్ అడుగగా ఆమె మీకు ఎన్ని కావాలన్నా ఇస్తానని చెప్పిందట మరీ

దీంతో త్రిష కోపరేషన్ నచ్చి నిర్మాత ఆమె మీద మనసు పారేసుకున్నారని  ఒక టాక్ కూడా వచ్చింది. అందుకే తన తర్వాతి ప్రాజెక్టుల్లో త్రిషనే ఎక్కువగా కనిపించేది. వర్షం సినిమా తర్వాత సిద్దార్థ్ హీరోగా నువ్వొస్తానంటే నేనొద్దంటనా మూవీ చేసి మరో హిట్ కొట్టిన ఎంఎస్ రాజు.. ప్రభాస్ హీరోగా పౌర్ణమి సినిమా చేశాడు.ఇందులో చార్మితో పాటు మరోసారి త్రిషను హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. ఈ సినిమా స్టోరీ బాలేదని పలువురు చెప్పిన వినలేదట  మరి నిర్మాత.. అది కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఎంఎస్ రాజుకు సక్సెస్ రేటు  చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం మళ్లీ నిర్మాతగా రాణించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు ఎంఎస్ రాజు గారు, హిట్ కోసం ఆయన వేచి చూడాల్సిందే మరి. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: