వామ్మో.. జబర్దస్త్ లో రష్మీ అంత తీసుకుంటుందా?

praveen
బుల్లితెరపై హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక జబర్దస్త్లో అతని పంచుల సునామీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సాదాసీదా కమెడియన్ గా తెలుగు బుల్లితెరపై అరంగేట్రం చేసిన హైపర్ ఆది తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని టీం లీడర్ గా ఎదిగాడు.  ఇకపోతే ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని కార్యక్రమాలకు కూడా స్క్రిప్ట్ అందించడమే కాదు అతనే మెయిన్ కమెడియన్గా కొనసాగుతున్నాడు.


 ఇకపోతే మొన్నటి వరకు జబర్దస్త్ కు దూరంగా ఉండి కేవలం శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ షోలలో మాత్రమే కనిపించిన హైపర్ ఆది.. ఇటీవలే మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేశాడు. దీంతో పడిపోయిన జబర్దస్త్ రేటింగ్స్ హైపర్ ఆది రాకతో మళ్ళీ పుంజుకున్నాయి అని చెప్పాలి. ఇక ప్రేక్షకులందరికీ మరింత కొత్తగా కామెడీ పంచేందుకు కేవలం ఎవరి టీంలో వారు కాకుండా రెండు టీంలు కలిసి సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కూడా స్కిట్స్ చేస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఈవారం ప్రసారం  కాబోయే జబర్దస్త్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో  ఇటీవల విడుదల చేశారు.


 ఈ క్రమంలోనే బుల్లెట్ భాస్కర్ రాకింగ్ రాకేష్ ఇమ్మానుయేల్ తో సహా మరి కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ క్రికెట్ టీం గా ఏర్పడి స్టేజి మీదకొచ్చి సందడి చేశారూ ఈ క్రమంలోని ఇటీవల విడుదలైన ప్రోమోలో భాగంగా హైపర్ ఆది వేసిన ఒక పంచ్ కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే స్కిట్లో భాగంగా ఇక్కడ ఉండకు పద నీ రెమినరేషన్ నేను ఇస్తాను అంటూ బుల్లెట్ భాస్కర్ యాంకర్ రష్మీతో చెబుతాడు. ఇక వెంటనే అందుకున్న హైపర్ ఆది రష్మీ  పారితోషికం నువ్వు ఇవ్వాలంటే వంద పెద్దమనిషి ఫంక్షన్లు చేయాలి అంటూ పంచ్ వేస్తాడు. పంచ్ తర్వాత ఏంటి రష్మీకి అంత పెద్ద మొత్తంలో పారితోషకం ముట్ట చెబుతున్నారా అని అందరూ ఆలోచనలో పడిపోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: