అయోధ్యలో అర్జునుడు వైపు మహేష్ అడుగులు !
ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ రిపీట్ కాబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీకి ‘అయోధ్యలో అర్జునుడు’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈమూవీ షూటింగ్ కు మహేష్ తల్లి మరణంతో ఒక బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
మహేష్ తల్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఇప్పుడు ఈసినిమా షూటింగ్ మళ్ళీ మొదలవుతుంది అని భావిస్తున్న తరుణంలో ఈ మూవీ షూటింగ్ కు మరొక బ్రేక్ పడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మహేష్ కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్ళాడని మరో వారం రోజుల వరకు తిరిగి రాడని అంటున్నారు. మరికొందరైతే మహేష్ డాక్టర్ చెకప్ నిమిత్తం అమెరికా వెళ్ళాడని అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి.
వాస్తవానికి ఈసినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావలసి ఉన్నప్పటికీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈసినిమాను వచ్చే ఏడాది ఏప్రియల్ లో విడుదల చేస్తారని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈసినిమాకు సంబంధించి కేవలం ఒక చిన్న షెడ్యూల్ మాత్రమే పూర్తి అయిన పరిస్థితులలో ఈసినిమా షూటింగ్ ఇంకా 90 శాతం వరకు ఉంది అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈసినిమా షూటింగ్ అనుకున్న విధంగా పూర్తికాకపోతే మరొకసారి వాయిదా పడే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవిధంగా ఈ న్యూస్ మహేష్ అభిమానులకు నిరాశ పెట్టే విధంగా ఉంటుంది అనుకోవాలి..