మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే చిరంజీవి. ఈ సంవత్సరం మొదటగా మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. అలా ఆచార్య మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర అపజయం ఎదుర్కొన్న చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ మూవీ తో మరో సారి ప్రేక్షకులను పలకరించాడు.
గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు మరియు హిందీ భాషలో విడుదల అయ్యింది. గాడ్ ఫాదర్ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుంది. ఇలా గాడ్ ఫాదర్ మూవీ మంచి విజయం సాధించడంతో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి "ఓ టి టి" ఎంట్రీ పై స్పందించాడు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన "ఓ టి టి" ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు. "ఓ టి టి" లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు తనకి ఎలాంటి అభ్యంతరం లేదని , మంచి సబ్జెక్ దొరికితే "ఓ టి టి" లోకి కూడా డెఫినెట్ గా చేస్తానని తెలిపారు. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ , నయన తార ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ప్రస్తుతం కూడా గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది.