ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న నిధి అగర్వాల్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికీ ఎన్నో తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ హీరోయిన్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.  ఇది ఇలా ఉంటే నిధి అగర్వాల్ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎక్కువ శాతం కమర్షియల్ మూవీ లలోనే నటించింది. కమర్షియల్ మూవీ లలో వీలు చిక్కినప్పుడల్లా తన అంద చందాలను కూడా ఆరబోసి ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది.


ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన హీరో అనే మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నీది అగర్వాల్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.


మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతోంది. ఈ మూవీ కనుక మంచి సక్సెస్ ను సాధించినట్లు అయితే నిధి అగర్వాల్ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ మరో క్రేజీ మూవీ లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నిధి అగర్వాల్ కి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లు ,  ప్రభాస్ సరసన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసినట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త కనక నిజం అయితే నిధి అగర్వాల్ మరో క్రేజీ మూవీ ఆఫర్ ను కొట్టేసినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: