కాంతార: RRR, KGF రికార్డులు గల్లంతు?

Purushottham Vinay
కాంతార: RRR, kgf రికార్డులు గల్లంతు?

కన్నడ స్టార్ డైరెక్టర్  రిషబ్ శెట్టి  హీరోగా నటించిన సినిమా 'కాంతార'. ఈ మూవీ కన్నడ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదలైంది.ఈ సినిమా ఒక రేంజ్ లో బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.ఈ సినిమా ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. హిట్ టాక్‌తో భారీ వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రానికి రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించాడు.'కాంతార' సినిమా ఒక డివోషనల్ మూవీగా ఇంకా అలాగే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ సినిమాలో అనేక రకాల గూస్ బంప్స్ కలిగించే ట్విస్ట్‌లుంటాయి. మూవీ క్లైమాక్స్ కూడా సీక్వెల్‌కు ఊతమిచ్చేలా ఉంటుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల సందర్భంగా రిషబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో భాగంగా సీక్వెల్‌పై స్పందించాడు. ''ప్రస్తుతం నా దృష్టంతా 'కాంతార' పైనే ఉంది. సీక్వెల్‌పై నేను మాట్లాడలేను. దాని గురించి తర్వాత ఆలోచిస్తాం. 


అయితే, మూవీలో చాలా ఉప కథలున్నాయి. కాబట్టి సీక్వెల్ కోసం చాలా ఛాయిస్‌లు ఉన్నాయి'' అని రిషబ్ శెట్టి తెలిపాడు. 'బెల్ బాటమ్' సీక్వెల్‌పై కూడా రిషబ్ మాట్లాడాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నాడు. మొదటి పార్ట్‌తో పోల్చుకుంటే సీక్వెల్ అన్ని అంశాల్లోను పదింతలు ఉంటుందని వెల్లడించాడు. 'కాంతార' పై అనేక మంది సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ధనుష్, ప్రభాస్, రానా దగ్గుబాటి తదితరులు పొగిడారు. 'కాంతార' ఐఎమ్‌డీబీలో 9.6 రేటింగ్ సాధించి చరిత్ర సృష్టించింది. 'కెజియఫ్-2' (KGF 2), 'ఆర్ఆర్ఆర్' (RRR) రేటింగ్‌లను అధిగమించింది. ఐఎమ్‌డీబీలో 'కెజియఫ్-2'కు 8.4రేటింగ్ రాగా, 'ఆర్ఆర్ఆర్' కు 8రేటింగ్ వచ్చింది. ఈ రెండు చిత్రాల రేటింగ్‌లను 'కాంతార' అధిగమించడం విశేషం.ఇక చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను కొళ్లగొట్టి సంచలనాలు క్రియేట్ చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: