హన్సిక వివాహం చేసుకోబోతోందా..?
మొదట టీవీ సీరియల్స్ ద్వారా చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన హన్సిక తెలుగు, తమిళ ,హిందీ వంటి పరిశ్రమలు పలు చిత్రాలలో నటించింది. ఇక ఎంతోమంది హీరోలతో కూడా ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం సాధించింది అని వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. తన వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త మలుపు మొదలు కాబోతోందని చెప్పవచ్చు. ఇక తన ప్రేమించిన వాడితోనే పెళ్లికి సిద్ధమైందని సమాచారం డిసెంబర్లో జైపూర్ కోటలో ఈమె వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.450 ఏళ్ల నాటి కోట జైపూర్ ప్యాలెస్ కావడంతో హన్సిక వివాహం వేడుకలు పాతకాలపు పద్ధతిలో ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.
అయితే డిసెంబర్లో ఈమె పెళ్లి జరగబోతోందని సమాచారం. అయితే హన్సిక విషయంలో ఎన్నో పుకార్లు వినిపించిన ఎట్టకేలకు వివాహానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. జైపూర్లో ముందట ఫోర్ట్ ఆఫ్ ప్యాలెస్ అందుకు వేదికగా ఎంచుకున్నట్లు సమాచారం. హన్సిక వివాహానికి సంబంధించి పెళ్ళి తేది ఇంకా తెలియలేదు కానీ హన్సిక తన డ్రీం బాయ్ ని వివాహం చేసుకోబోతోందని సమాచారం. అయితే ఈ ప్రదేశానికి ఢిల్లీ నుంచి ఐదు గంటలసేపు ప్రయాణం పడుతుందని తెలుస్తోంది. ఇక హన్సిక మొదట పలు టీవీ సీరియల్స్ ద్వారా చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ప్రస్తుతం కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటివరకు ఈమె 50 సినిమాలలో నటించినట్లు తెలుస్తుంది.