కాంతారా సినిమా రచ్చ మాములుగా లేదుగా...!!
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమా కన్నడ వెర్షన్ కి కర్ణాటక లో మొదటి రోజు కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట..కానీ తెలుగు లో దానికి రెండింతలు ఎక్కువ వసూళ్లు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం..మంచి సినిమా ఇస్తే తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని మరి ఆరాధిస్తారు అనడానికి ఇంకేముంది నిదర్శనం ఇదే.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుగు వెర్షన్ కి కలిపి రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగిందట..మొదటి రోజే దాదాపుగా 2 కోట్ల రూపాయిల షేర్ రావడం తో ఈ సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్ కి 90 శాతం రికవరీ అయ్యింది..ఇక రెండవ రోజు ఈ సినిమాకి ప్రతి చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..అద్భుతమైన వసూళ్లు కూడా వచ్చాయి..ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటి అంటే ఈ సినిమాకి తెలుగు లో మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది..రెండవ రోజు ఈ సినిమాకి థియేటర్స్ సంఖ్య కూడా మొదటి రోజు తో పోలిస్తే బాగా పెంచారట..రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా రెండవ రోజు సుమారు 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది.
అంటే ఈ సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్ కి మూడింతల లాభాలు అన్నమాట..అది కూడా కేవలం రెండు రోజుల్లోనే..ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీ కి రాలేదనే చెప్పవచ్చు..ఈ సినిమాకి వస్తున్న వసూళ్ల ప్రవాహం చూస్తుంటే ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల షేర్ వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయట.