బోయపాటి - రామ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో..?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా 'RAPO20'. అయితే ఇటీవలే బోయపాటి బాలయ్యతో అఖండ సినిమా తీసి ఘన విజయం అందుకుని తన నెక్స్ట్ సినిమా కోసం మరింత జోష్ గా సిద్ధం అవుతున్నాడు.ఇకపోతే రామ్ పోతినేని ఎనర్జీ బోయపాటి యాక్షన్ తో మిక్స్ అయితే ఇక అదిరిపోయే మాస్ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది.అయితే అందుకే ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి. ఇక ఇది పాన్ ఇండియా సినిమాగా


 తెరకెక్కుతుండడంతో ఫుల్ ఫోకస్ పెట్టి తెరకెక్కించ బోతున్నారు.. ఇక ఈ సినిమా నుండి దసరా కానుకగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అంతేకాదు ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా హీరోయిన్ ను ఫిక్స్ చేసారు. అయితే పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల ఈ సినిమాలో భాగం కానుంది అంటూ పోస్టర్ ద్వారా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు..ఇక అలాగే షూటింగ్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ను మరింత సర్ప్రైజ్ ఇచ్చాడు.. రామోజీ ఫిలిం సిటీలో అక్టోబర్ 6 నుండే రెగ్యురల్ షూట్ స్టార్ట్ చేసారు.. యాక్షన్ సన్నివేశాలతో స్టార్ట్ చేసి గ్యాప్ లేకుండా షూటింగ్ ముగిస్తున్నారు..


కాగా ఈ సినిమాలో రామ్ ఫాదర్ గా బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకో బోతున్నారు అంటూ తాజాగా ఒక వార్త వైరల్ అయ్యింది. అయితే ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చాలా కీలకం అని అందుకే ఈ పాత్ర కోసం బాలీవుడ్ హీరోను తీసుకున్నారని సమాచారం..ఇదిలావుంటే ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ మాజీ హీరో సునీల్ శెట్టి అట.. పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మలచాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా యాక్టర్స్ ను తీసుకుని మరింత అంచనాలు పెంచుతున్నాడు బోయపాటి.. చూడాలి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో.. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తున్నాడు.అయితే  మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: