గ్లామర్ షోతో పిచ్చెక్కిస్తున్న కృతిశెట్టి.. అందుకోసమేనా..?

Anilkumar
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా అందరికి తెలుసు. ఇక ఈ సినిమా ద్వారానే మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ అలాగే కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి మొదటిసారి హీరో, హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.ఇకపోతే మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న వీరు ఇటీవల ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇకపోతే కృతి శెట్టి వరుస సినిమాలతో బిజీగా అవుతూ గ్లామర్ షో తో కూడా కుర్ర కారును కట్టిపడేస్తోంది. అయితే ఒక్క సినిమాతో కుర్ర కారు కలల రాకుమారిగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ .. 

ఓవర్ నైట్ లోనే నేషనల్ క్రష్ గా అభిమానులను మెప్పిస్తోంది.తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన ఫోటోలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.బ్లాక్ డ్రెస్ లో దేవకన్యలా ఇప్పుడే భువి నుంచి నేలకు దిగివచ్చిన మోడ్రన్ మేనకలా కళ్ళు చెదిరే అందంతో మెరిసిపోతోంది.ఇదిలావుంటే  మరోవైపు థైస్ అందాలు చూపిస్తూ ఉల్లిపొర లాంటి టైట్ ఫిట్ డ్రెస్ ధరించి తన అందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఈ క్రమంలోనే ఈమె ఇలా వరుసగా గ్లామర్ షో తో అభిమానులకు హాట్ ట్రీట్ ఇవ్వడానికి కూడా కారణం లేకపోలేదు.అయితే ఉప్పెన సినిమా తర్వాత బంగార్రాజు,

శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి.. ఆ తర్వాత ఆ క్రేజ్ ను అలాగే ఉంచుకోలేకపోయింది. ఇక కథల ఎంపిక విషయంలో తడబాటు పడ్డ ఈమె తర్వాత కాలంలో నటించిన మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి.అయితే ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఇక అది కూడా నాగచైతన్యతో వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బైలింగ్వల్ చిత్రం. అయితే మరి ఈ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియదు కానీ సినిమాలలో అవకాశాల కోసం ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తూ యువతను పిచ్చెక్కిస్తోంది. అంతేకాదు కనీసం ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో తెలియాల్సి ఉంది..!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: