రూ.600 చీరను ధరించి హీరోయిన్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన కంగనా..!!
ఇక మీరు చేసే ప్రతి పని కూడా దేశానికి ఉపయోగపడాలి మీరు ప్రాంతీయ వస్తువులను కొనడం వల్ల వాటి మీద ఆధారపడిన ఎన్నో కుటుంబాలు కూడా లాభపడతాయని అందుచేతను ఎప్పుడూ కూడా ప్రాంతీయ వస్తువులను వాటిని ప్రోత్సహించాలి అంటు తెలియజేసింది. అయితే విదేశీ మోజులో పడకూడదని జైహింద్ అంటూ కంగాన రనౌత్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అయితే రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ఈసారి 600 రూపాయల చీర కట్టులో కనిపించి ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే వివాదాస్పందమైన చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంగనా ఈ చిత్రంతో సక్సెస్ అయిందంటే చాలు కచ్చితంగా ఈ సినిమాకు మంచి లాభాలు వస్తాయని ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చీరకట్టలో కనిపించడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించేలా కాకుండా ఇంతటి తక్కువ ధరతో కూడా ఇంతటి అందంగా కనిపించవచ్చా అనే విధంగా పలువురు నెట్టిజనుల సైతం కామెంట్లు చేస్తూ ఉన్నారు.