పవర్ ఫుల్ యాక్షన్ ను తలపించే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఆవురావురుమంటూ ఎదురుచూస్తారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ....కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సినిమాలు ఆలస్యమవుతున్నాయి.ఇకపోతే జూనియర్ సినిమాలు లేటుగా వచ్చినా.. లెటెస్ట్ కథతో వస్తున్నాయి.అంతేకాదు ఇంతకుముందు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ భీం పాత్రలో నటించి ప్రేక్షకులకు మంచి బిర్యానీ తినిపించాడు. అయితే ఈ భారీ మూవీ తరువాత జూనియర్ ను అదే స్థాయిలో చూపించాలనుకున్నాడు కొరటాల శివ. ఇక దీంతో ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. కాగా వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది.
అయితే కొన్ని కారణాల వల్ల ఆగింది. ఈ నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమా కథపై ఆసక్తి చర్చ సాగుతోంది.అంతేకాదు గరుడ పురాణంలోని ఓ ముఖ్యమైన పాయింట్ ఆధారంగా కథ మూవ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇదిలావుంటే ట్రిపుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ పెరిగిపోయింది. అయితే ఇక నుంచి ఆయనతో పాన్ ఇండియా సినిమాలే తీయాలని కొందరు డైరెక్టర్లు డిసైడ్ అయ్యారు. కాగా కొరటాల శివ కూడా అదే ఊపుతో #NTR 30 కి డిసైడ్ అయ్యాడు. ఇక ఈ మూవీని కూడా ఇండియా లెవల్లో తీసేందుకు ప్లాన్ వేస్తున్నారు. అంతేకాదు దీని అనౌన్స్ ఎప్పుడో జరిగింది. కరోనా.. ఇతర కారణాల వల్ల ఆలస్యమైంది. ఇక ఈ సినిమా కథను ఇప్పటికే రెడీ చేసుకున్నాడట కొరటాల. మళ్లీ దానిని పూర్తిగా మార్చేసి కొత్త కథను తయారు చేయించాడట.
ఇక ఈసారి గరుడ పురాణంలోని ఓ అంశాన్ని తీసుకొని కథను రెడీ చేశారట.అయితే గరుడ పురాణంలో 18 వేల శ్లోకాలు ఉన్నాయి.అంతేకాదు ఒక మనిషి మరణించిన తరువాత ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంటారు..? అనేది గరడు పురాణంలో శ్లోకాల ద్వారా వివరించబడుతాయి. ఆ మనిషి బతికున్నప్పుడు ఎలాంటి తప్పులు చేశాడు..? చనిపోయిన తరువాత ఎలాంటి శిక్షను అనుభవిస్తాడు…? అనే వివరాలను తెలుపుతుంది. వైష్ణవ సాహిత్య కార్పస్ లో గరుడ పురాణం ఒక భాగం. ఇక దీనిని నేరుగా చదవడానికి ఇబ్బందే. ఇందులో ముఖ్యమైన పాయింట్ ఆధారంగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని కొరటాల నమ్మకం. ఈ సరికొత్త పాయింట్ ను ఎంచుకున్నాడట.ఇక ఇండియాలోనే కాకుండా వెస్ట్రన్ కంట్రీల్లోనూ ఎన్టీఆర్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సినిమాను జపాన్, తదితర 9 భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఇదివరకు ఎన్టీఆర్ -కొరటాల కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బంపర్ హిట్టు కొట్టింది.అయితే ఇప్పుడు #NTR 30 కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని అంటున్నారు.ఇక తాజాగా గరుడ పురాణం విషయం బయటికి రావడంతో ఫ్యాన్స్ మరింత జోష్లో ఉన్నారు..!!