ఒక బిడ్డకు తల్లి అయినా.. అందంతో పిచ్చెక్కిస్తున్న ప్రణీత..!!

Divya
ప్రణీత సుభాష్ తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అత్తారింటికి దారేది చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది. ఇక ఇటీవలే తన భర్త నితిన్ రాజు తన వారసురాలతో ఫోటోషూట్లని ప్రణీత షేర్ చేయడం జరిగింది అవి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. మరొకవైపు సామాజిక, రాజకీయ అంశాల పైన కూడా తనదైన లెవెల్లో స్పందిస్తూ ఉంటుంది. దీనిపై పలుసార్లు సోషల్ మీడియాలో ప్రశంసలతో పాటు ట్రోల్స్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రణీత.

ప్రణీత ఈ ఏడాది జూన్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక తన గారాల పట్టి గురించి తెలుసుకోవాలని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఉన్నారు. అయితే ఇంతలోనే ప్రణీత తన పుట్టినరోజు ఫొటోస్ తో అందరికీ షాక్ ఇచ్చింది.  ప్రణీత బ్లాక్ డ్రెస్సులో బ్లాక్ జీన్స్ లో అదిరిపోయే ఫోజులను ఇచ్చింది. ప్రణీత తల్లి అయినా కూడా ఇంకా తన అంద చందాలతో కుర్రకారులను సైతం ఆకట్టుకునేలా కనిపిస్తోంది . ఇప్పటికి సినిమాలను నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈ ఫోటోతో చెప్పకనే చెబుతోంది ప్రణీత.

అయితే ఎంతోమంది బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత తమ పాత రూపానికి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.  అలాంటి అవసరం లేకుండా ప్రణిత కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే ఇలా అందమైన లుక్ లో అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 2021 మే 30న వ్యాపారవేత్త నితిన్ ను వివాహం చేసుకుందు. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జంట తమ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించబోతోంది అనే విషయాన్ని తెలియజేశారు . ప్రణీత చివరిసారిగా 2019లో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: