తమిళ స్టార్ హీరో కార్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఆయన నటిస్తున్న సినిమా సర్దార్.కాగా ఈ సినిమాతో 90 స్ హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక దాంతో అటు తమిళ్ తో పాటు..ఇటు తెలుగులో కూడా ఈసినిమాపై క్యూరియాసిటీ పెరిగిపోయింది.ఇకపోతే లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీలో కార్తీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అంతే కాదు ఇక సర్దార్ లో కార్తి డ్యూయల్ రోల్ కూడా చేయబోతున్నాడు.అయితే దాదాపుగా 15 ఏళ్ల తరువాత ఈ సినిమా ద్వారా హీరోయిన్ లైలా రీ ఎంట్రీ ఇస్తుంది లైలా.
కాగా సర్ధార్ సినిమాలో.. ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నాడు హీరో కార్తి. తన పాత్ర గురించి చెపుతూ.. లైలా గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు కార్తి.అంతేకాదు తన సినిమాత్ో లైలా రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం అన్నారు కార్తి. ఇక ఈ సినిమాకి తన పాత్ర చాలా కీలకమన్నారు. అంతే కాదు ఇక ఆమె పాత్ర వల్లనే ఈసినిమా కథ మలుపు తిరుగుతుందట.అయితే ఈ సినిమాలో తనతో పాటు లైలాను చూసి ఆడియర్స్ థ్రిల్ ఫీల్ అవుతారు అన్న విధంగా చెప్పారు కార్తి.ఇక ఈ నెల 21 న రిలీజ్ కాబోతుంది సద్ధార్ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుంది. .
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇదిలావుంటే తాజా ఇంటర్వ్యూలో కార్తి మాట్లాడుతూ .. 'సర్దార్' యాక్షన్ ప్రధానంగా సాగే ఎమోషనల్ డ్రామా. అయితే ఇంతవరకూ నేను చేసిన పాత్రలకి ఈ సినిమాలో చేసిన పాత్ర చాలా తేడా ఉంటుంది అన్నారు కార్తి.ఇక ఇలా కదా మనం కార్తిని చూడాలనుకున్నది అనే విధంగాచేశారట తమిళ హీరో. హీరోయిన్స్ గురించి చూసుకుంటే.. ఈమూవీలో రాశి ఖన్నాతో పాటు రజీషా విజయన్ కూడా నటించింది....అయితే అవ్వడానికి ఇద్దరు హీరోయిన్లు అయినా.. ఈ ఇద్దరు బ్యూటీస్ కు ప్రాధాన్యత కలిగిన పాత్రలు దక్కాయి. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈసినిమాకు .. మ్యూజిక్ తో పాటు ఫొటోగ్రఫీ హైలెట్ కాబోతుంది.ఇకపోతే రెండేళ్లపాటు స్క్రిప్ట్ పై కూర్చున్నాము .. ఏడాది పాటు షూటింగు చేశాము.ఇక అందుకు తగిన ఫలితాన్ని ఈ సినిమా రాబడుతుందనే నమ్మకం ఉంది అంటా చెప్పుకొచ్చారు కార్తి..!!