పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీని షేక్ చెయ్యాలంటే పెద్ద డైరెక్టర్లు, పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్ సినిమాలు అవసరం లేదు. సినిమా కంటెంట్ బాగుంటే చాలు. ఆటోమాటిక్ గా జనాలు ఆదరిస్తారు. ఆ సినిమాలను నెత్తిన పెట్టుకుంటారు. బ్రహ్మ రథం పడతారు.దానికి ప్రత్యేక సాక్ష్యమే రీసెంట్ గా అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద 120 కోట్లకి పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన తెలుగు సినిమా ‘కార్తికేయ 2‘. యువ హీరో నిఖిల్ – డైరెక్టర్ చందూ మొండేటి కాంబినేషన్ లో కార్తికేయకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం.. పాన్ ఇండియా వైడ్ పాజిటివ్ టాక్ తో కలెక్షన్స్ అదరగొట్టింది. తక్కువ బడ్జెట్ లో కంటెంట్, క్వాలిటీ అంశాలతో రూపొందిన కార్తికేయ 2కి.. కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ రాబోతుంది.ఇప్పటికే కార్తికేయ 3పై క్లారిటీ ఇచ్చేశాడు హీరో నిఖిల్. అయితే.. కార్తికేయ మూవీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నేపథ్యంలో రాగా.. కార్తికేయ 2 ద్వారకా, శ్రీకృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కింది. దీంతో కార్తికేయ 3 మూవీ ఏ అంశంపై రాబోతుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో కార్తికేయ 3కి సంబంధించి మేకర్స్ అయితే ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ.. ఈసారి కార్తికేయ 3 మూవీని అయోధ్య రామాలయం రహస్యాలను బేస్ చేసుకొని ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
అంటే.. మూడో భాగంలో శ్రీరాముడి చుట్టూ కథ ఉండబోతుందని భావిస్తున్నారు ప్రేక్షకులు.ఇక కార్తికేయ 3 స్టోరీ ఏంటనేది అధికారికం కాకపోయినా.. అయోధ్య రామమందిరం నేపథ్యంలో ఉంటుందనే విషయం తెలిసి నెటిజన్స్, ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. అదీగాక హీరో నిఖిల్ కూడా వీలైనంత త్వరగా సినిమాను తెరమీదకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలిపాడు.కాబట్టి కార్తికేయ 2 క్రియేట్ చేసిన రికార్డుల దృష్ట్యా కార్తికేయ 3ని నేరుగా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేసే అవకాశం లేకపోలేదు. మరోవైపు చందూ మొండేటి వేరే స్టార్ హీరోతో యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాడని ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. మరి కార్తికేయ 3 సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా కార్తికేయ 2 స్టోరీని మించి స్ట్రాంగ్ స్టోరీ వుండాల్సిందే కదా.. అందుకే ఈసారి భారీ అంచనాలు పెరగడంతో గట్టి స్టోరీనే ప్లాన్ చేశారు. ఇది కూడా ఓ కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయం. మరి చూడాలి కార్తికేయ 3 ఎలాంటి రికార్డులని నమోదు చేస్తుందో..