RC15: మరో హీరోయిన్ కూడా..?

Purushottham Vinay
RC15: మరో హీరోయిన్ కూడా..?


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమాతో నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు రామ్‌చరణ్‌. ఈ సినిమాతో తన నటనపై విమర్శలు కురిపించిన వాళ్ల నోటికి తాళం వేశాడు.ఇక ఈ సంవత్సరం వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంతో గ్లోబల్‌గా విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన లెజండరీ డైరెక్టర్ శంకర్‌తో RC15 చేస్తున్నాడు. మాములుగానే శంకర్‌ సినిమాలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడేకంగా చరణ్‌తోనే సినిమా చేయనుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.యాక్షన్ థ్రిల్లర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ తండ్రి, కొడుకుగా రెండు పాత్రల్లో నటించనున్నాడు. చరణ్‌కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 



అంతే కాకుండా ఈ చిత్రం దిల్‌రాజు నిర్మాణంలో 50వ సినిమాగా తెరకెక్కుతుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది. శంకర్‌ సినిమాల్లో ప్రతి నటుడిగా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ క్రమంలో పాత్రకు ఎవరు షూట్‌ అవుతారో వారినే శంకర్‌ ఎంచుకుంటుంటాడు. కాగా ఈ చిత్రంలోని ఓ కీలకపాత్ర కోసం సీనియర్‌ హీరోయిన్‌ ఖుష్భును ఎంచుకున్నాడట. ఈమె పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని టాక్‌. ఖుష్భు చిరంజీవితో కలిసి స్టాలిన్‌ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఖష్భు చిరుకు అక్కగా నటించింది. మళ్లీ పదహారేళ్ళకు చిరు తనయుడు చరణ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతుంది. అయితే దీనిపై చిత్రబృందం నుండి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.మరి ఇక చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: