తన మూడు పెళ్లిళ్లపై అదరిపోయే సమాధానం ఇచ్చిన పవన్...!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల తో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయాలని అనుకుంటే చాలామంది రాజకీయ నాయకులు ఆయన మూడు పెళ్లిళ్ల గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు.


అయితే వైవాహిక జీవితంలో ఇబ్బందుల వల్లే తాను మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింద ని పవన్ కళ్యాణ్ గతంలోనే వెల్లడించారు. అయితే విమర్శలు రిపీట్ అవుతుండటంతో పవన్ తాజాగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారట..


తన మూడు పెళ్లిళ్ల గురించి పదే పదే విమర్శలు రావడంతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని పదేపదే మాట్లాడుతున్నారని నేను విడాకులు ఇచ్చిన తర్వాతే మరో పెళ్లి చేసుకున్నానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారట.చట్ట ప్రకారం నేను భరణం చెల్లించానని పవన్ కళ్యాణ్ అన్నారు. మొదటి భార్య నందిని కి 5 కోట్ల రూపాయల భరణం ఇచ్చానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడం విశేషం.


రెండో భార్య కు ఆస్తి రాసిచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ విడాకుల గురించి, తన భార్యలకు ఇచ్చిన భరణం గురించి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇకనైనా విమర్శలు ఆగిపోతాయేమో మరీ చూడాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేన, చంద్రబాబు టీడీపీ పొత్తు పెట్టుకుంటాయ ని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీపై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేయగా వైసీపీ మంత్రులు సైతం రివర్స్ లో కౌంటర్లు ఇస్తున్నారు.


ప్యాకేజీ స్టార్ అని కామెంట్లు చేసేవాళ్ల కు సైతం పవన్ కళ్యాణ్ ధీటుగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం. పవన్ కళ్యాణ్ విషయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు సైతం మండిపడ్డారట.. అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందని రాబోయే రోజుల్లో కలిసి కార్యక్రమాలు చేద్దామని చంద్రబాబు వెల్లడించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: