రవితేజ-మీరా జాస్మిన్ డిష్యూం..డిష్యూం..

Satvika
సాదారణంగా సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదొక గొడవలు జరుగుతూనే ఉంటాయి.కొందరు హీరోలు లేదా హీరోయిన్లు చేసే పనుల వల్ల చాలా అపార్థాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. హీరోలు లేదా హీరోయిన్లు షూటింగ్‌లో కోపరేట్ చేయకపోవడం, ఇగోల వల్ల చాలా సమస్యలే ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎంసీఏ సినిమా షూటింగ్‌లో నాని, సాయిపల్లవి మధ్య ఇగో ప్రాబ్లమ్స్ వల్లే పెద్ద గొడవ జరిగింది. చివరకు దర్శక, నిర్మాతలు జోక్యం చేసుకుని పరిష్కరించారు.మంచు విష్ణు డెబ్యూ మూవీ విష్ణు సినిమా షూటింగ్‌లో హీరోయిన్ వల్ల పెద్ద సమస్య రాడం.. చివరకు మోహన్‌బాబు వార్నింగ్ ఇవ్వడం.. ఈ విషయం వార్తల్లోకి ఎక్కడం జరిగింది.


ఇలా చాలా సినిమాల విషయంలో హీరోలు, హీరోయిన్లో లేదా హీరోయిన్లు, దర్శకుల మధ్యో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే మాస్ మహరాజ్ రవితేజకు గతంలో ఆయనకు జోడీగా నటించిన ఓ హీరోయిన్‌కు మధ్య చిన్నపాటి గొడవ జరిగిందన్న ప్రచారం అయితే బయటకు వచ్చింది.తెలుగు అగ్ర హీరో మాస్ మహారాజ రవితేజ , మీరా జాష్మిన్ కలిసి నటించిన సినిమా అంటే ఠక్కున గుర్తుకు వచ్చే సినిమా భద్ర..బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.అయితే ఈ సినిమా షూటింగ్ టైంలోనే రవితేజతో మీరా పంతానికి పోయిందని టాక్ ? అందుకే కొద్ది రోజుల పాటు భద్ర షూటింగ్ ఆగిపోవడం.. బోయపాటి కూడా తన తొలి సినిమాకే ఇలా జరిగిందేమిటని ఆందోళన చెందడం జరిగిందట. అయితే ఈ ఇష్యూను దర్శక నిర్మాతలతో పాటు కొందరు ఇండస్ట్రీ పెద్దలు సెటిల్ చేశారు.


అయితే ఈ సినిమాకు సమానంగానే మీరా జాస్మిన్ బాలయ్య పక్కన మహారథి సినిమాలోనూ నటించింది. అందుకే మీరా వల్లే బాలయ్యకు,రవితేజకు మధ్య గొడవ జరిగిందన్న పుకార్లు ఆ సమయంలో ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చాయి. అసలు గొడవ మీరా జాస్మిన్ వల్ల రవితేజతో చిన్న ఇష్యూ జరిగితే.. చివరకు అదే టైంలో బాలయ్యతో ఆమె నటిస్తుండడంతో రవితేజకు, బాలయ్యకు ఏదో జరిగిందన్న ప్రచారం కూడా బయటకు వచ్చింది.. ఇదే అసలు మ్యాటర్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: