నటి సౌందర్య గురించి ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన ఆమని..!!

murali krishna
టాలీవుడ్ లోని సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా  మనం చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల అందరితో నటించింది.

ఇకపోతే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా   ప్రారంభించిన ఆమని ప్రస్తుతం పలు సినిమాలలో తల్లి, అత్త పాత్రలోనే నటిస్తూ  చాలా బిజీగా ఉండడమే కాకుండా.. పలు షో లలో కూడా జడ్జిగా వ్యవహరించింది. ఇక దివంగత హీరోయిన్ నటి సౌందర్య కు ఆమె బెస్ట్ ఫ్రెండ్ అన్న విషయం మాత్రం ఇండస్ట్రీలో చాలామందికి తెలిసినా సంగతి.

ఇక వీరిద్దరూ కలిసి ఎన్నో చిత్రాలలో  కూడా నటించారు. సౌందర్య మరణించినప్పుడు ఆమని చాలా దిగ్భ్రాంతికి గురైందట. సౌందర్య లేని లోటు ఎవరు తీర్చలేరని.. ఆమె స్థానంలో ఎవరు రాలేదని కూడా ఎన్నో సందర్భాలలో ఆమె తెలియజేసింది ఆమని. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య గురించి ఎవరికీ తెలియని పలు విషయాలను తెలియజేసింది. సౌందర్య మరణించినప్పుడు తన మెంటల్ కండిషన్ ఏవిధంగా ఉన్నది అనే విషయంపై చెప్పుకొస్తూ.. 'సౌందర్య చనిపోయింది అన్నమాట విన్నప్పుడు తనకేమీ తెలియదని.. ఆ సమయంలో దేవుడిని చాలా తిట్టుకున్నానని తెలియజేసింది ఆమని.

ఆమె స్థానంలో నేను చనిపోయి ఉంటే బాగుండేది దేవుడా.. ఎందుకు ఇలా చేశావు' అని ఎన్నోసార్లు  దేవుడని తిట్టుకున్నానని ఆ సమయానికి పెళ్లయి తనకి ఏడాది కావస్తోంది అని తెలియజేసింది. జీవితం మొత్తం చూసేసాను.. నేను చనిపోయినా బాధ ఉండేది కాదు అని, ఆమని మైండ్లో అనుకున్నట్లుగా ఆమె తెలియజేసింది ఇలా, అయితే సౌందర్య చనిపోయాక సౌందర్య తల్లిని కలిసిందట. సౌందర్యకు పెళ్లికాకముందే ఆమె అన్నయ్యను వివాహం చేసుకుంటావా అని సౌందర్య తల్లి ఆమనినీ అడిగేదట. కానీ ఆ సమయంలో ఆమె నాకు కెరియర్ మీద తప్ప పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని తెలియజేసిందట ఆమని. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: