తాజాగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రం కాంతార.ఇక సెప్టెంబర్ 3వ తేదీ కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ తెలుగులో డబ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇకపోతే ఆయన నటించిన ఈ సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలుగు హక్కులను కొనుగోలు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీ విడుదల కాగా మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది.ఇదిలావుంటే ఇక కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన సినిమా తెలుగు హక్కులను
అల్లు అరవింద్ కేవలం రెండు కోట్ల రూపాయలకే కొనుగోలు చేశారు అయితే ఈ సినిమా మూడు రోజులలో భారీ లాభాలను అందుకుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మూడు రోజులకు గాను ఏకంగా 6.80 కోట్ల రూపాయల షేర్స్ రాబట్టింది అలాగే 13.5 కోట్ల గ్రాస్ రాబట్టింది.ఇక ఇలా రెండు కోట్లకు కొనుగోలు చేయగా ఈ సినిమా ఏకంగా నాలుగు కోట్ల రూపాయల లాభాలను తీసుకువచ్చింది.అయితే ఈ విధంగా మూడు రోజులకే నాలుగు కోట్ల లాభం అంటే మామూలు విషయం కాదు.ఇకపోతే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమా హవా కొనసాగుతోంది.
అయితే ఈ సినిమా ముగిసేనాటికి ఎంతో సులభంగా పది నుంచి 15 కోట్ల వరకు లాభాలను రాబడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.అయితే ఇక ఏది ఏమైనా అల్లు అరవింద్ మాత్రం అత్యంత తక్కువ ధరలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి భారీగా లాభాలను పొందుతున్నారని తెలుస్తోంది.ఇక పోతే ఈ సినిమా తెలుగులో విడుదల చేయడంతో ఈ సినిమా ప్రభావం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాపై పడిందని చెప్పాలి..!!